Tuesday, September 17, 2024

మొదలైన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్

- Advertisement -
- Advertisement -

చెన్నై: రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్) ప్రమోట్ చేస్తున్న ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్(ఐఆర్‌ఎల్) -2024 తొలి రౌండ్ ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ రేసర్లతో శనివారం లాంఛనంగా మొదలైంది. శక్తివంతమైన సింగిల్ సీటర్ కార్లు మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై దూసుకెళ్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీ ఆదివారం కూడా జరగనుంది. ఇందులో మొత్తం తొమ్మిది రేసులు జరుగుతాయి.

క్వాలిఫయింగ్ రేసులు అదనం. ఫ్రాంచైజీ ఆధారిత ఐఆర్‌ఎల్‌కు ఎఫ్‌ఐఏ -సర్టిఫై చేసిన ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్ స్టేటస్ ఉంది. ఐఆర్‌ఎల్ ఈ సీజన్‌లో మొత్తం ఐదు రౌండ్లు ఉంటాయి. ఇందులో భాగంగా వచ్చే వారాంతంలో చెన్నై నడిబొడ్డున చారిత్రాత్మక నైట్ స్ట్రీట్ రేస్ నిర్వహిస్తారు. 2022 ఎఫ్4 ఇండియన్ చాంపియన్షిప్ విన్నర్, బెంగళూరుకు చెందిన అఖిల్ రవీంద్ర, స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ రేసర్ నీల్ జానీ, 2022 డానిష్ ఎఫ్4 ఛాంపియన్ అయిన జూలియస్ డినెసెన్ ఐఆర్‌ఎల్ బరిలో నిలిచారు.

పురుషులతో పాటు ఆరుగురు మహిళా డ్రైవర్లు కూడా పోటీలో ఉన్నారు. ఐఆర్‌ఎల్‌లో ఆరు జట్లయిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (హైదరాబాద్), చెన్నై టర్బో రైడర్స్ (చెన్నై), కోల్‌కతా రాయల్ టైగర్స్ (కోల్‌కతా), స్పీడ్ డెమన్స్ ఢిల్లీ (ఢిల్లీ), గోవా ఏసెస్ జేఏ రేసింగ్ (గోవా), బెంగళూరు స్పీడ్‌స్టర్స్ (బెంగళూరు)లో ఇద్దరు భారతీయ, మరో ఇద్దరు విదేశీ డ్రైవర్లు ఉన్నారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ -2024 సీజన్లో భాగంగా చెన్నై నడిబొడ్డున స్ట్రీట్ సర్క్యూట్లో దేశంలోనే మొట్టమొదటి నైట్ రేస్‌ను నిర్వహించబోతున్నామని ఆర్పీపీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి తెలిపారు. భారత రేసింగ్ చరిత్రలో ఇది చాలా పెద్ద ముందడుగని అభిప్రాయపడ్డారు.. ఈ సీజన్లో దేశ, విదేశాల నుంచి అగ్రశ్రేణి రేసర్లు బరిలో ఉన్నారని, వచ్చే ఏడాది జట్ల సంఖ్యను విస్తరిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News