Sunday, January 19, 2025

హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దు.. చైన్నైకి తరలింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:ఇండియన్ రేసింగ్ లీగ్ మీద ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండడంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దాంతో రేసింగ్‌ను నిర్వాహకులు చెన్నైకు తరలించారు. నవంబర్ 4, 5 తేదీల్లో రేసింగ్ లీగ్ ఉంటుందని ప్రచారం అయ్యింది. అందుకోసం హుస్సేన్ సాగర్ తీరాన అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు.

దీనికి సంబంధించిన టికెట్లను కూడా ఇప్పటికే ఆన్‌లైన్‌లో నిర్వాహకులు అమ్మివేశారు. అయితే రేస్ రద్దు కావడంతో టికెట్ల డబ్బులు తిరిగి ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ లీగ్‌ను నిర్వహించవద్దని పోలీసులు ముందే చెప్పకపోవటంతో భారీ నష్టం వచ్చిందని నిర్వాహుకులు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News