Wednesday, January 22, 2025

రేస్ విజేతగా కొచ్చి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హుస్సేసాగర్ తీరాన రయ్.. రయ్… అంటూ ఫార్ములా రేసింగ్ కార్లు సందడి చేశాయి. ఆదివారం ఓ వైపు వర్షం కురుస్తున్నా ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వాహకులు జరిపారు. ఈ నేపథ్యంలో వర్షంతో తడిసిన రోడ్లపై రేసింగ్ జోరుగా సాగింది. ఉర్రూతలూగించిన ఇండియన్ రేసింగ్ లీగ్‌లో గాడ్‌స్పీడ్ కొచ్చీ టీం విజయం సాధించగా, కొద్ది పాయింట్ల తేడాతో రెండో స్థానంలో హైదరాబాద్ టీం నిలిచింది. దేశీయంగా ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు మొట్ట మొదటిసారిగా హైదరాబాద్‌లో జరుగుతుండటంతో ఈ పోటీలను చూడడానికి భాగ్యనగరవాసులు భారీగా తరలివచ్చారు. ఇక శనివారం రేసింగ్ నిర్వహణలో గందరగోళం నెలకొనడంతో శనివారం క్వాలిఫైయింగ్ పోటీలు జరపకుండా రెండు ప్రాక్టీస్ సెషన్స్‌ను మాత్రమే నిర్వాహకులు నిర్వహించారు.

ఈ నేపథ్యంలోనే నిన్న జరగాల్సిన షెడ్యూల్ రేస్‌లతో పాటు ఫీచర్ రేస్‌లు ఆదివారం జరిగాయి. దీంతో ఆదివారం జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ తుది పోటీల్లో కొచ్చీ జట్టు విజయం సాధించగా ఈ పోటీలను చూడడానికి ప్రేక్షకులతో పాటు సినిమాస్టార్‌లు సైతం హాజరయ్యారు. ఆదివారం జరిగిన స్టైలిష్, హ్యాండ్ సమ్ బ్లాక్ జాకెట్ లుక్‌లో రాంచరణ్, బ్లూ డ్రెస్‌లో ఉపాసనలు ఈ ఫార్ములా ఈ రేసుకు హాజరయ్యారు.
ట్రోఫీని అందుకున్న అలిస్టర్ యూంగ్ ఫస్ట్
ఇండియన్ రేసింగ్ లీగ్ ఆదివారం ముగిసింది. ఉర్రూతలూగించిన ఇండియన్ (ఫార్ములా కార్) రేసింగ్ లీగ్ ఫైనల్ విజేతగా కొచ్చి టీం గెలిచింది. కొద్ది పాయింట్ల తేడాతో రెండో స్థానంలో హైదరాబాద్ టీం నిలిచింది. 417.5 పాయింట్లతో గాడ్‌స్పీడ్ కొచ్చీ టీం మొదటి స్థానం దక్కించుకోగా, 385 పాయింట్లతో హైదరాబాద్ బ్లాక్ బర్స్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు. 282 పాయింట్లతో మూడో స్థానంలో గోవా, 279 పాయింట్లతో నాలుగో స్థానంలో చెన్నై టీం, 147.5 పాయింట్లతో ఐదో స్థానంలో బెంగుళూరు టీం, 141 పాయింట్లతో ఆరో స్థానంలో ఢిల్లీ టీంలు నిలిచాయి.

ఆదివారం జరిగిన ఫైనల్ రేసింగ్ లీగ్‌కు గెస్ట్‌గా సినీ హీరో అక్కినేని నాగచైతన్య రాగా గెలిచిన టీంలకు ఆయన అభినందనలు తెలిపారు. మొదటి స్ప్రింట్ రేసింగ్‌లో గాడ్ స్పీడ్ కొచ్చీ టీం కి చెందిన 19 ఏళ్ల అలిస్టర్ యూంగ్ ఫస్ట్ ట్రోఫీని అందున్నారు.
అరగంట ఆలస్యంగా ప్రారంభం
షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన రేసింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమయ్యింది. 9.30 గంటల నుంచి 10 గంటల వరకు ఫ్రీ ప్రాక్టీస్ రేస్ 30 నిమిషాల పాటు జరిగింది. అనంతరం 10.30 గంటల నుంచి ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 1, 10.50 గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 2, 11.30 గంటలకు మొదటి లైన్ ఓపెన్/ క్లోజ్ స్ప్రింట్ రేస్ 1 డ్రైవర్ బి (5 నిముషాలు), 11.45 గంటల కు స్ప్రింట్ రేస్ 1 ఇండియన్ రేసింగ్ లీగ్ డ్రైవర్ బి + లాప్ 1 (20 నిముషాలు) ఒంటి గంటకు రెండో లైన్ ఓపెన్/ క్లోజ్ స్ప్రింట్ రేస్ 1 డ్రైవర్ ఏ (5నిముషాలు), 1.15 నిమిషాలకు స్ప్రింట్ రేస్ 2 ఇండియన్ రేసింగ్ లీగ్ డ్రైవర్ ఏ + లాప్ 1 (20 నిముషాలు), 1.45 గంటల నుండి 2.45 గంటల వరకు లంచ్ బ్రేక్‌ను నిర్వాహకులు నిర్వహించారు. 3.20 గంటలలకు లైన్ ఓపెన్/ క్లోజ్ ఫుచార్ రేస్ ఇండియన్ రేసింగ్ లీగ్ 3 ప్రారంభం కాగా (5 నిముషాల) పాటు అనంతరం 3.45 నిమిషాలకు ఫుచార్ రేస్ 3 ఇండియన్ రేసింగ్ లీగ్ + లాప్ 1 (35 నిముషాల) పాటు రేసింగ్ జరిగింది.
ట్రాక్‌పై నిలిచిపోయిన కారు
చిరుజల్లులతో ట్రాక్ తడిసిముద్దవ్వడంతో రేసర్లు తమ కార్లను జాగ్రత్తగా నడిపారు. కొన్నిసార్లు రేసింగ్ కార్‌లు స్కిడ్ అయ్యేలా ట్రాక్ మారడంతో రేసర్లు చాకచక్యంగా కార్లను కంట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో స్కిడ్ అయిన ఓ కార్ ట్రాక్‌పై నిలిచిపోవడంతో నిర్వాహకులు దానిని బయటకు తరలించారు. అంతలోనే రేసింగ్ ట్రాక్‌పై సడెన్‌గా ప్రత్యక్షమైన కుక్కను బయటకు పంపించేందుకు నిర్వాహకులు ఇబ్బందులు పడ్డారు. మొదటి, రెండో స్ప్రింట్ రేసింగ్‌లో గాడ్ స్పీడ్ కొచ్చీ టీం ముందంజలో నిలిచింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన అసలైన ఇండియన్ రేస్ పోటీలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News