Monday, December 23, 2024

త్వరలో రైల్వే ‘సూపర్’ యాప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే త్వరలో సూపర్ యాప్‌ను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే ట్రైన్ టికెట్ బుకింగ్, ఫుడ్ డెలివరీ, పీఎన్‌ఆర్ స్టేటస్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్ సహా, అన్ని రకాల రైల్వే సేవలు ఓకే చోట లభిస్తాయి. మరీ ముఖ్యంగా ట్రైన్ టికెట్ బుకింగ్, ట్రాకింగ్, ఫుడ్ డెలివరీ లాంటి సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసమే ఒక సూపర్ యాప్‌ను రూపొందించే పనిలో ఉంది. కాగా ఈ ఒక్క యాప్ కోసం రూ. 90 కోట్ల వరకు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ సూపర్ యాప్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News