Sunday, January 19, 2025

రైలు అడ్వాన్స్ బుకింగ్ టైమింగ్ లో మార్పు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైమును మార్చింది. ఇదివరలో 120 రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు దానిని 60 రోజులకు కుదించింది. కాగా దీని ప్రభావం నేడు ఐఆర్ సిటిసి షేర్ ట్రేడింగ్ మీద పడింది. మధ్యాహ్నం 2.20 గంటలకు 2.2 శాతం పడిపోయి రూ. 867.60 వద్ద ఒక్కో షేరు ట్రేడయింది.

ఇండియన్ రైల్వే వారి కొత్త రూల్ 2024 నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ నవంబర్ 1 కన్నా ముందుగా కొన్న టికెట్లకు ఈ కొత్త రూల్ వర్తించదు. 2024-25లో భారత రైల్వేస్ 7.5 బిలియన్ల మంది ప్యాసంజర్లను రవాణా చేసింది. అది గత సంవత్సరంతో పోల్చినప్పుడు 9 శాతం అధికం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News