న్యూఢిల్లీ: రక్షాబంధన్ పండగ సందర్భంగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వేశాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరో 16 రైళ్ల రాకపోకల స్టేషన్లను మార్చింది. మరో 15 రైళ్ల దూరప్రయాణాన్ని కుదించింది. ఈమేరకు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, న్యూఢిల్లీ, జమ్ముకశ్మీర్, పశ్చిమబెంగాల్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.
రద్దయిన రైళ్ల వివరాలు
రాయపూర్-సికింద్రాబాద్, రాజ్‌కోట్-సికింద్రాబాద్, హౌరా-సాయినగర్ షిర్డీ, హౌరా-చందన్‌పూర్, రాంచీ-పాట్నా, ఛత్రపతి శివాజీ మహరాజ్-టెర్మినల్ హౌరా, అహ్మదాబాద్-హౌరా, బిలాస్‌పూర్-ఇట్వారీ, పోరుబందర్-షాలిమార్, రాంచీ-దుంకా, న్యూఢిల్లీ-రోహతఖ్, గోరఖ్‌పూర్-గోమతినగర్, వరణాసి-మైసూర్, న్యూజల్సాయిగురి-అలీపూర్‌ద్వార్, టాటానగర్-ఇట్వారీ, కోర్బా-అమృతసర్, అజ్వీర్‌పూరి-బర్ధమాన్‌హౌరా రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. పఠాన్ కోట్, జ్వాలాముఖి రోడ్డు, అసన్‌సోల్ మెయిన్ బొకారో స్టీల్ సిటీ, సివాన్ జంక్షన్ గోరఖ్‌పూర్, రాంనగర్ మొరాదాబాద్ రైళ్లను రద్దు చేశారు.
Indian Railways Cancelled 149 Trains