Thursday, January 23, 2025

జూన్ 30 వరకు పలు రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు కారణంగా పలు రైళ్లను నెల 27 నుంచి 30 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే కీలక ప్రకటన చేసింది. రైల్వే ప్రయాణికులు ఈ విషయం గమనించాలని స్పష్టం చేసింది. 07462/63 వరంగల్, సికింద్రాబాద్ పుష్‌పుల్ రైలు, 17035/36 కాజీపేట- బలార్షా, 07766/65 కరీంనగర్ సిర్పూర్ టౌన్, 07894 కరీంనగర్- బోధన్ రైలు జూన్ 30 వరకు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారిమళ్లించినట్లు తెలిపింది. రద్దైన రైళ్లలో విజయవాడ- బిట్రగుంట (07978), బిట్రగుంట- విజయవాడ (07977),

రాజమండ్రి-విశాఖపట్నం (07466), విశాఖపట్నం- రాజమండ్రి (07467), బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237), చైన్నై సెంట్రల్- బిట్రగుంట (17238), కాకినాడ పోర్ట్- విశాఖపట్నం (17267), విశాఖపట్నం- కాకినాడ పోర్ట్ (17268), విజయవాడ- విశాఖపట్నం (22702), విశాఖపట్నం- విజయవాడ (22701), కాచిగూడ -నడికుడి (07791), నడికుడి కాచిగూడ (07792) నెంబర్ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ- గుంటూరు (07783), గుంటూరు -విజయవాడ(07788), గుంటూరు- మాచర్ల (07779), మాచర్ల- గుంటూరు (07780) తదితర రైళ్లను సైతం దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రేపల్లె- మార్కాపూర్ రోడ్ (0788), మార్కాపూర్ రోడ్- తెనాలి (07890), హుబ్లీ -విజయవాడ (17329), విజయవాడ- హుబ్లీ (17330) రైళ్లను పలు స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News