Sunday, January 19, 2025

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో భారతీయ రైల్వే

- Advertisement -
- Advertisement -

బహుళ ప్రదేశాలలో.. ప్రజా సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎక్కువ మంది – భారత రికార్డు అనే అంశంలో ప్రఖ్యాత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో భారతీయ రైల్వేశాఖ పేరును నమోదు చేసుకుంది. రైల్వే మంత్రిత్వ శాఖ 26 ఫిబ్రవరి 2024 న నిర్వహించిన కార్యక్రమానికి 2,140 ప్రదేశాలలో మొత్తం 40,19,516 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం రోడ్ ఓవర్ / రోడ్ అండర్ రైల్వే వంతెనల ప్రారంభోత్సవంతో పాటు రైల్వే స్టేషన్ల పునః అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన చేసేందుకు నిర్వహించిన కార్యక్రమాలు. భారతీయ రైల్వేలు చేసిన ఉన్నత కృషికి గుర్తింపుగా ప్రఖ్యాత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో తన పేరును నమోదు చేసుకో గలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News