Sunday, February 23, 2025

ఐఆర్‌సిటిసి యూజర్లకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

Indian Railways increases Online Ticket booking limit by IRCTC App

ఐఆర్‌సిటిసి యూజర్లకు శుభవార్త
ఇకపై రెట్టింపు రైలు టికెట్ల బుకింగ్

న్యూఢిల్లీ: ప్రజలు ఆధార్‌తో తమ యూజర్ ఐడిని అనుసంధానం చేసుకుంటే ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఇకపై నెలకు 24 రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చని, లేని పక్షంలో 12 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరని రైల్వే మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. ప్రజలు తమ యూజర్ ఐడిలను ఆధారతో లింక్ చేసుకుంటే నెలకు 12 టికెట్లు, లింక్ కాని పక్షంలో 6 టికెట్లను మాత్రమే బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సిటిసి ప్రస్తుతం అనుమతిస్తోంది. ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేందుకు రైలు టికెట్ల బుకింగ్ సంఖ్యను రెట్టింపు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. తరచు రైలు ప్రయాణం చేసే వారికి, కుటుంబ సభ్యులకు రైలు టికెట్లు బుక్ చేసేందుకు ఒకే అకౌంట్‌ను ఉపయోగించేవారికి తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా ఉండగలదని రైల్వే శాఖ పేర్కొంది.

Indian Railways increases Online Ticket booking limit by IRCTC App

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News