Monday, December 23, 2024

రైళ్లలో సీనియర్ సిటిజన్ల రాయితీకి కేంద్రం స్వస్తి

- Advertisement -
- Advertisement -

Indian Railways Suffered Recurring Loss

టికెట్ ధరలు తక్కువతో రైల్వేకు విపరీత నష్టం

న్యూఢిల్లీ : రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే (సీనియర్ సిటిజన్లు) రాయితీని పునరుద్ధరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధులకిచ్చే టికెట్ రాయితీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాయితీల వల్ల రైల్వేశాఖపై విపరీతమైన భారం పడుతోందన్నారు. వృద్ధులకు టికెట్ ధరపై రాయితీని 2020లో రైల్వేశాఖ రద్దు చేసింది. అయితే పార్లమెంట్ సభ్యులకు, మాజీ ఎంపీలకు మాత్రం రాయితీలను కొనసాగించింది. సీనియర్ సిటిజన్లు సహా అన్ని వర్గాల ప్రయాణికుల వల్ల ఇప్పటికే సగటున 50 శాతం ఖర్చును రైల్వేశాఖ భరిస్తోందని, టికెట్ ధరలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2019-20 తో పోలిస్తే కొవిడ్ కారణంగా ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని, ఇది దీర్ఘకాలంలో రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుందని సమాధానమిచ్చారు. ఈ పరిస్థితుల్లో రాయితీలను అనుమతిస్తే రైల్వేశాఖపై మరింత భారం పడుతుంది. కాబట్టి మునుపటిలా సీనియర్ సిటిజన్లు సహా అన్ని కేటగిరీల రాయితీ పునరుద్ధరణ అనేది ఆశించడం సరికాదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News