Friday, January 24, 2025

బంగ్లాదేశ్‌కు రైలు సర్వీసులు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశానికి అన్ని రైలు సర్వీసులను భారతీయ రైల్వే సోమవారం నిలిపివేసింది. కోల్‌కత ఢాకా-కోల్‌కత మైత్రీ ఎక్స్‌ప్రెస్(13109/13110), కోల్‌కత-ఢాకా–కోల్‌కత మైత్రీ ఎక్స్‌ప్రెస్ (13107/ 13108), కోల్‌కత-ఖుల్న-కోల్‌కత బంధన్ ఎక్స్‌ప్రెస్, ఢాకా–న్యూ జల్పాయ్‌గురి–ఢాకా మిథాలీ ఎక్స్‌ప్రెస్‌లను సస్పెండ్ చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. కాగా, ఢాకాకు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News