Saturday, November 23, 2024

వచ్చే ఐదేళ్లలో ‘కవచ్’ విధానాన్ని అమలుచేయనున్న రైల్వే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భవిష్యత్తులో రైలు ప్రమాదాలు నివారించడానికి భారతీయ రైల్వే 44000 కిమీ. రైలు ట్రాక్ లో కవచ్ విధానాన్ని అమలుచేయనున్నది. దీనిని రాగల ఐదేళ్లలో అమలుచేయనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు క్యాబినేట్ కార్యదర్శికి రాసింది.

కవచ్ అనేది ఆటోమేటిక్ రక్షణ విధానం. ఇది రైళ్ల ప్రమాదాలను నివారిస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే ఢిల్లీ-ముంబై, అలాగే ఢిల్లీ-హౌరా రూట్లలో కవచ్ విధానాన్ని అమలుచేయడానికి పూనుకున్నారు. ఈ ఏడాది చివరికల్లా అదనంగా 6000 కిమీ ట్రాక్ల  కోసం టెండర్లను జారీచేయనున్నారు.

రైల్వే సురక్షణ కోసం మూడు కంపెనీలతో కలిసి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్ డిఎస్ఓ) ‘కవచ్’ను డిజైన్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News