Sunday, June 30, 2024

దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ ఎప్పటి కీ మరవలేని కటిక చీకట్ల అధ్యాయం అని రాష్ట్రపతి ద్రౌపదీ ము ర్మూ పేర్కొన్నారు. గురువారం రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. అప్పటి అత్యయిక పరిస్థితి దేశంలోని అత్యంత విలువైన రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి గా మారింది. ప్రజాస్వామిక విలువల అణచివేత జరిగిందని రాష్ట్రపతిచెప్పారు. 18వ లోక్‌సభ ఆరంభం, మోడీ 3.0 ప్రభుత్వ హయాం లో రాష్ట్రపతి పార్లమెంట్‌ను ఉద్ధేశించి ప్రసంగించడం ఇదే తొలిసా రి. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా ఒక్కరోజు క్రితమే ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని పేర్కొంటూ, దీనిని ఖండిస్తూ తీర్మానం వెలువరించడం, దీనిపై కాంగ్రెస్ నుంచి తీవ్రస్థాయి విమర్శలు వెలువడుతున్న

దశలో ఇప్పుడు రాష్ట్రపతి కూడా తమ ప్రసంగంలో ఎమర్జెన్సీ అం శాన్ని ప్రస్తావించారు. ఈ ఘటన బాధాకరం అన్నారు. ఓ చేదు ని జం నిలిచిపోయింది. అయితే ఇప్పుడు తిరిగి రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, రాజ్యాంగాన్ని జన స్రవంతిలో అంతర్భాగం చేసేందుకు దారులు సుగమం చేస్తున్నామ ని పేర్కొన్నారు. మన దేశ రాజ్యాంగం విశిష్టం, అంతకు మించి అం దరికీ శిరోధార్యం అని రాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాణ సమయంలో ప్రపంచంలో కొన్ని శక్తులు భారత్ విఫలం కావాలని కోరుకున్నాయి. రాజ్యాంగం ఏర్పడిన తరువాత కూడా ఈ ప్రక్రియను పలు సార్లు దెబ్బతీయడానికి పావులు కదిపారని చెప్పారు. ఈ రోజు జూన్ 27 , సంవత్సరాల క్రితం జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటితం అయింది. రాజ్యాంగంపై దాడి క్రమంలో ఇదో చీకటి అధ్యాయంఅయిందని, యావత్తూ దేశం షాక్‌కు గురై, రగిలిపోయిందన్నారు.

ఇప్పుడు రాజ్యాంగానికి పరిపూర్ణత
దేశంలో అడపాదడపా తలెత్తిన రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై మన జాతి విజయం సాధించింది. ప్రజాతంత్ర భారతదేశం మన ఆయువుపట్టు అయింది. తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కేవలం పాలనా మాధ్యమంగానే భావించడం లేదు. అంతకు మించి జనం అంతర్లీన భాగం అయ్యేలా చేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తోంది. ఆర్టికల్ 370తో పరిస్థితులు భిన్నంగా ఉంటూ వచ్చిన దేశ తలమానిక జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో నెలకొల్పడం జరిగిందన్నారు.

దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లపై కసరత్తు
రవాణా వ్యవస్థలో వినూత్న వేగవంత ప్రక్రియలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో బల్లెట్ ట్రైన్ కారిడార్ల ఏర్పాట్లు సాధాసాధ్యాలను పరిశీలిస్తారని రాష్ట్రపతి తెలిపారు. ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాలో ఈ దిశలో ఈ రైలు మార్గాల ఏర్పాటుకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది తొలుత పరిశీలిస్తారని చెప్పారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఇప్పుడు అహ్మదాబాద్ ముంబై హై స్పీడ్ రైలు మార్గం పర్యావరణ హితం రీతిలో చురుగ్గా నిర్మాణ పనుల దశలో ఉందన్నారు.

మన ఎన్నికల సంఘం ఘనం
దేశంలో ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేయడంలో ఎన్నికల సంఘం అత్యంత కీలక పాత్ర పోషించింది. ప్రపంచ స్థాయిలోనే అతి భారీ ఎన్నికల ఘట్టాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగిందని రాష్ట్రపతి ఈ నేపథ్యంలో ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. ప్రత్యేకించి కశ్మీర్‌లోయలో దశాబ్దాలలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయిందన్నారు. ప్రపంచం అంతా ఇక్కడి ఎన్నికలు పట్ల ఆసక్తిని ప్రదర్శించింది. విస్తృత స్థాయి ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. ప్రజలు స్సష్టమైన మెజార్టీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని, ఇది మన ప్రజాస్వామిక రాజ్యాంగయుత, ఎన్నికల ప్రక్రియ పట్ల నిలిచిన అపార విశ్వాసం అన్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి విస్పష్ట మెజార్టీ సర్కారు రావడ ం కీలక విషయం అన్నారు.

10 సంవత్సరాలలో మనం ఐదో ఆర్థిక శక్తి అయ్యాం
తమ ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ, మహిళా, యువజన , రైతాంగ ఇతర రంగాలలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పాలసీలు సత్ఫలితాలు ఇచ్చాయని రాష్ట్రపతి మోడీ సర్కారు క్రమానికి కితాబు ఇచ్చారు. ప్రభుత్వం ఆర్‌పిటి అంటే రిఫార్మ్ , పర్‌ఫామ్ , ట్రాన్స్‌ఫాం అంటే సంస్కరణ, పనితీరు, పరివర్తన దిశల్లో సక్రమంగా వెళ్లిందని, దీనితో దేవం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఐదవ ఆర్థిక శక్తి అయిందన్నారు. పలు రంగాలలో ప్రగతి సాధించామని, ప్రత్యేకించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని బహుముఖ కోణాలపై దృష్టి సారించడం జరిగిందన్నారు.

రైతాంగానికి రూ 3,20,000 కోట్లతో సంక్షేమం
తమ ప్రభుత్వం దేశంలోని వ్యవసాయదారుల బాగుకు పాటుపడిందని రాష్ట్రపతి వెల్లడించారు. రైతుల చిన్నపాటి వ్యయాల కోసం వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పరిధిలో మొత్తం మీద రూ 3,20,000 కోట్లు పంపిణీ జరిగిందన్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సమస్యలపై స్పందిస్తూ వచ్చిందని, ఈ క్రమంలో విశ్వబంధు రీతిలో పలు ప్రపంచ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుందని తెలిపారు. ఇప్పుడు ప్రపంచం అంతా భారత్‌ను ప్రజాస్వామిక మాతృక అని కొనియాడుతోందని, దీనికి ఎంపిలంతా గర్వించాల్సి ఉందన్నారు. ప్రజలు మనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాలి, ఈ క్రమంలో మన పటిష్ట ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పార్లమెంటెరియన్లకు రాష్ట్రపతి పిలుపు నిచ్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని , సమగ్రతలను కించపరిచే ఎటువంటి దుష్ట చర్యలను అయినా మనం అంతా కలిసి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా తిప్పికొట్టాల్సి ఉందన్నారు.

సైబర్ శక్తుల పట్ల జాగ్రత్త
ఇప్పుడు మనం ఈ ప్రపంచం అంతా కూడా కమ్యూనికేషన్ యుగంలో ఉన్నాం. ఈ క్రమంలో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మేలుచేస్తుంది. ఇదే క్రమంలో సైబర్ నేరాలతో వినాశనం జరుగుతుంది. ఈ క్రమంలో సాంకేతిక దుర్వినియోగంతో సమాజంలో చీలికలు, అశాంతికి పనిచేసే తద్వారా మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తులను సహించరాదని రాష్ట్రపతి తెలిపారు. ఐటి సైబర్ నేరాలపై భారతదేశం అంతర్జాతీయ వేదికల నుంచి వెలువరించిన నిర్మాణాత్మక సందేశాలతో సముచిత వాతావరణం ఏర్పడుతోంది. ఏ క్రమంలో చూసినా ఈ శతాబ్ధం భారతదేశపు శతాబ్ధం అని రాష్ట్రపతి ప్రకటించారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌తో భారదేశం మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అయ్యేలా చేసేందుకు చారిత్రక రీతిలో అడుగులు పడుతున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News