Sunday, December 22, 2024

త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

- Advertisement -
- Advertisement -

హర్యానాలో జింద్‌సోనిపట్ మార్గంలో ( 90 కిలో మీటర్ల ) హైడ్రొజన్ రైలును తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ నెలలో ఇది పట్టాలెక్కనుంది. పర్వత ప్రాంతాల రైల్వేలైన్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కాసిమ్లా రైల్వేతో పాటు మరికొన్ని మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి రూ. 80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లు అందుబాటు లోకి తీసుకు రావాలని ఇండియన్ రైల్వే ఆలోచన చేస్తోంది. టికెట్ ధర కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది.

కేవలం నీటినే ఇంధనంగా చేసుకుని ఈ రైలు నడుస్తుంది. ఈ రైలుకు గంటకు 40 వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ఈరైలు ప్రయాణిస్తుంది. శబ్దం కూడా చాలా తక్కువే. ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే వెయ్యి కిలోమీటర్లు వెళ్లగలదు. హైడ్రొజన్ ఫ్యూయల్ టెక్నాలజీతో ఈ రైలు నడుస్తుంది. హైడ్రొజన్, ఆక్సిజన్ కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడుతుంది. 2018 నుంచి జర్మనీలో హైడ్రోజన్ రైళ్లు తిరుగుతున్నాయి. పర్యావరణానికి మేలు చేకూర్చే ఉద్దేశంతో భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలును తీసుకొస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News