Monday, December 23, 2024

రైలు ప్రయాణికులకు మళ్లీ బ్లాంకెట్లు

- Advertisement -
- Advertisement -

Indian Railways To Resume Providing Blankets

న్యూఢిల్లీ : కరోనా కారణంగా గత రెండేళ్లుగా రైలు ప్రయాణికులకు బ్లాంకెట్లు అందలేదు. ఇప్పుడు మళ్లీ ఈ సౌలభ్యాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్‌తోపాటు కర్టెయిన్లు కూడా తిరిగి అందుబాటు లోకి తేనున్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు కిందిస్థాయి అధికారులకు జారీ చేశారు. ఇక ఇప్పటికే వీటిని సరఫరా చేయడం ప్రారంభించామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కేవలం ఎంపిక చేసిన 638 రైళ్లకే ఈ సౌకర్యం కల్పించారు. ఈ జాబితాలో లేని రైళ్లలోని ప్రయాణికులు స్వంతంగా తమ బ్లాంకెట్లు, దుప్పట్లు తెచ్చుకోవాలని రైల్వే విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News