Monday, December 23, 2024

మహాలయ అమావాస్యకు ఇండియన్ రైల్వే ప్రత్యేక రైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహాలయ అమావాస్యను పురస్కరించుకుని భారతీయ రైల్వే -భారత్ గౌరవ్ పథకం కింద ప్రత్యేక రైలును నడిపించనుంది. అక్టోబర్ 10 నుండి 21వ తేదీ వరకు (11 రోజుల పాటు ) ఈ రైలు ప్రయాగ్ రాజ్ – వారణాసి – గయ – అయోధ్య – హరిద్వార్ – ఢిల్లీ – మథుర – ఆగ్రాకు చేరుకోనుంది. భారత దేశ పురాతన సంప్రదాయాలు, దైవత్వం సారాంశంతో నిండిన ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆలయాల వీక్షణకు అవకాశం ఉంటుంది. ఈ రైలు ప్రయాణం యాత్రికులందరికీ గొప్ప అనుభూతిని అందించనుంది. మహాలయ అమావాస్య ప్రత్యేక రోజున యాత్రికులు తమ పూర్వీకులకు పిండ ప్రదానంను సమర్పించే అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రత్యేక రైలు మధురై నుండి బయలుదేరి,

గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట స్టేషన్లకు చేరుకోనుంది. దారి పొడువునా యాత్ర విశేషాలను వివరించేందుకు పిఎ సిస్టమ్స్‌తో పాటు సిసి టివి కెమెరాలు, కోచ్ సెక్యూరిటీ , టూర్ మేనేజర్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్‌లు, సందర్శన, రవాణా , మూడు పుటల దక్షిణ భారత భోజనం సహా వివిధ రకాల సౌకర్యాలను కల్పించనున్నారు. యాత్రికులు ఎల్‌టిసి, ఎల్‌ఎఫ్‌సి సౌకర్యాన్ని కూడా పొందే అవకాశం కల్పించనున్నారు. కాగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి రైల్ టూరిజం డాట్ కామ్ (www.railtourism.com)ని సందర్శించవచ్చని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News