న్యూఢిల్లీ: భూకంపంతో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియాలకు భారత్ చేయూతనిస్తోంది. టర్కీలో సోమవారం ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లు మూడు పెను భూకంపాలు సంభవించాయి. అనేక భవనాలు కూలిపోయాయి. అనేక మంది చనిపోవడం, లెక్కకు రానంత మంది గాయాలపాలవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తన వంతు సాయాన్ని టర్కీకి అందిస్తోంది. అందులో భాగంగా రెస్క్యూ టీమ్స్, రిలీఫ్ మెటీరియల్స్‌ను ఆ దేశానికి పంపింది. 50 మంది సభ్యులతో మంగళవారం రెండో విమానం గాజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరింది. అందులో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డిఆర్‌ఎఫ్)కు చెందిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, రెస్క్యూవర్కర్లు, కుక్కల స్క్వాడ్ బయలుదేరింది.
కోల్‌కతాలోని ఎన్‌డిఆర్‌ఎఫ్ రెండో బటాలియన్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ గుర్మిందర్ సింగ్ ఈ భారతీయ సహాయక బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే భారత్ నుంచి తొలి టీమ్ ఉదయం 3 గంటలకే బయలుదేరి వెళ్లింది. అది టర్కీలోని అదాన విమానాశ్రయంలో ఉదయం 10.30 గంటలకు చేరకుంది. టర్కీ, సిరియాలో ఇప్పటికే 5000 మందికి పైగా చనిపోయారు.
#WATCH | Second flight having a commander, 50 rescuers, one NDRF doctor, paramedics & rescuers left for #Turkey, from Hindon Airbase, Ghaziabad, at 11 am today, as India extends help to the earthquake-marred nation amid death toll there reaching 5,000.#TurkeyEarthquake pic.twitter.com/cM5NUvBb2k
— ANI (@ANI) February 7, 2023