లుధియానా: ఉక్రెయిన్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు సోమవారం ఆన్‌లైన్ తరగతులను పునఃప్రారంభించడాన్ని భారతీయ విద్యార్థులు స్వాగతించారు. రష్యా దాడితో ఆ దేశం వదిలి వచ్చేసిన రెండు వారాలకు వారి ముఖాలపై ఉపశమన భావం కనిపించింది. ‘మేము చాలా ఉపశమనం పొందాము…కనీసం, సిలబస్‌ను కొనసాగించగలం. యుద్ధ సమయంలో కూడా తరగతులు తీసుకుంటున్న మా ఉపాధ్యాయులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని అహ్‌తేషామ్ జాహిద్ అనే విద్యార్థి తెలిపాడు. అతడు ఎల్వివ్ నగరంలోని డానిలో హాలిట్కీ ఎల్వివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఎంబిబిఎస్ మూడో సంవత్సరం విద్యార్థి. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో తన ఇంటికి తిరిగొచ్చాడు. ప్రొఫెసర్ ఆండ్రీ బాజిలేవిచ్ ‘సిండ్రోమ్ ఆఫ్ హార్ట్ ఇన్‌సఫిసియెన్సీ’పై తీసుకున్న ఆన్‌లైన్ క్లాస్‌కు అతడు హాజరయ్యాడు. ఆన్‌లైన్ క్లాసులు మొదలయినప్పటికీ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ వారి భవిష్యత్తుపై ఆందోళనతోనే ఉన్నారు. 14 నుంచి 15 మంది విద్యార్థులను చిన్న గ్రూపుగా చేసి ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. ఎల్వీవ్, టెర్నోపిల్ వంటి పశ్చిమ నగరాల్లోని విశ్వవిద్యాలయాల్లో సోమవారం ఆన్‌లైన్ తరగతులు పునఃప్రారంభించబడ్డాయి. అయితే ఖార్కివ్ వంటి ఇతర నగరాల్లోని అనేక మంది ఉపాధ్యాయులు ఇంటర్నెట్ అంతరాయాల కారణంగా లాగిన్ కాలేకపోయారు.
ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు!
- Advertisement -
- Advertisement -
- Advertisement -