Sunday, December 22, 2024

భారతదేశ నదులు

- Advertisement -
- Advertisement -

భూ ఉపరితలం మీద గల నీరు.. ఉపనదు లు, నదులలోనికి వెళుతుంది. ఈ నదులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి.
నదులు నీటి అవసరాలు తీర్చడంతోపాటు నీటి పారుదలకు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తికి, నౌకాయానంనకు, వినోదానికి కూడా నీటిని అందిస్థాయి.
అలాంటి కార్యాలకు నీటిని అందించుటతో పాటు పై ప్రాంతాలన నుండి ఒండ్రుమన్నును వరద మైదానంలో..డెల్టాలలో నిక్షేపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఒండ్రుమట్టి ఉండుట వలన సారవంతంగా ఉంటుంది.
ప్రతి వరదల సమయంలో కొత్త ఒండ్రుమట్టి ఈ ప్రాంతంలో నిక్షేపించబడి మన్ను సారవంతం అధికం చేయబడును.
కావున వాస్తవంగా నదులు మానవాళికి వరం లాంటిది.
నదీ వ్యవస్థ పుట్టుక..

సాధారణంగా పర్వతాలు, భారీ వర్షపాతాల వల్ల అనేక నదులు పర్వత ప్రాంతాలలో పుడతాయి.
ఏటవాలు మీదుగా నీరు చిన్న ఏరు రూపంలో ప్రవహించి ఇతర చిన్న ఏరులతో కలిసి తర్వాత ధారగా ప్రవహిస్తాయి.
అనేక ఉపనదుల ప్రవాహాలు ఆవిర్భావం చెంది వివిధ అగ్రముల వద్ద ప్రధాన నదులతో కలుస్తాయి.
ఈ ప్రధాన ఏరును నది అని అంటారు. ఈ ఏరు దీని ఉపనదులతో కలిసి నదీ వ్యవస్థను ఏర్పరుస్తుంది.
నదీ వ్యవస్థను ఏటవాలు ప్రదేశం, భౌగోళిక నిర్మాణం, నీటి ఘనపరిమాణం, నీటి వేగం ప్రభావితం చేస్తాయి.
నదులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు అవి
1. హిమాలయ నదులు
2. ద్వీపకల్ప నదులు
హిమాలయ నదులు..
సింధు, గంగ, బ్రహ్మపుత్ర మొదలైన నదులు హిమపూరిత పర్వతాల నుండి జన్మిస్తున్నాయి.
ఇవి అధిక ప్రవాహ ప్రదేశంను, నదీ పరీవాహక ప్రాంతం కలిగి ఉంటాయి. ఈ నదులు లోతుగా లోయల నుండి ప్రవహిస్తుంది. ఇవి జీవనదులు, రుతుపవనాలు, మంచు కరుగుట వలన నీటిని పొందుతాయి. జీవ నదులు నీటి పారుదలకు చాలా ఉపయోగపడతాయి.
ఇవి సమతల ప్రాంతాల మీద ప్రవహించుట వలన నౌకాయానంకు తగిన విధంగా ఉంటాయి. ఈ నదులు నదీముఖ ద్వార మందు పెద్ద ముక్కోణాకారపు భూ ప్రదేశంను ఏర్పరుస్తున్నాయి.
ఉదా: గంగా, బ్రహ్మపుత్ర డెల్టా.
ద్వీపకల్ప నదులు..
మహానది, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మద, తపతి మొదలైనవి ద్వీపకల్ప నదులు ద్వీపకల్ప పీఠభూముల నుండి జన్మిస్తున్నాయి.
ఈ నదులు చిన్న ప్రవాహ ప్రదేశంను, చిన్న నదీ పరీవాహక ప్రాంతాలను కలిగి ఉంటాయి. ఈ నదులు విశాలమైన, లోతులేని లోయల ద్వారా ప్రవహిస్తాయి.
ఇవి రుతు ఆధారపు నదులు.
రుతుపవనాలు వర్షముల నుండి మాత్రమే నీటిని పొందుతాయి.
రుతు ఆధారపు నదులైనందు వలన నీటి పారుదలకు ఉపయోగపడవు.
దక్కను ప్రాంతంలో అసమ భూభాగాల మీద ప్రవహించుట వలన నౌకాయానానికి తగిన విధంగా లేదు.
పశ్చిమంగా ప్రవహించు నదులు అధికంగా నదీ ముఖద్వారములను, చిన్న డెల్టాలను ఏర్పరుస్తాయి.

భారతదేశ దీవులు:

అండమాన్ దీవులు:
హిందూ మహా సముద్రంలో రెండు ప్ర ధాన దీవుల సముదాయాలు కలవు. అవి బంగాళాఖాతంలో గల అండమాన్, నికోబార్ దీవుల సముదాయం, అరేబియా సముద్రంలోగల లక్ష ద్వీపములు.
ఈ దీవులు భారతదేశ ప్రధాన భాగం తీరానికి చాలా దూరంలో ఉన్నాయి. దీవుల్లో సుమారు 572 పెద్ద, చిన్న దీవులతో పాటు అతి చిన్న దీవులున్నాయి.
దీని మొత్తం వైశాల్యం 8249 చ.కి.మీ అండమాన్ దీవుల సముదాయం పది డిగ్రీల చానెల్ చేత నికోబార్ దీవుల సముదాయం నుండి వేరు పరచ బడి ఉన్నాయి. ఉత్తరార్ధ ఆగ్రమును ఇందిరా అగ్రము అని అంటారు.
అండమాన్ సన్నిహితంగా గల దీవు ల సముదాయంలో 25 దీవులలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. నికోబార్ దీవులలో 13 దీవులలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు.
అనేక దీవులు ఇసుక రాళ్లు, సున్నపు రాళ్లు, ముక్కలుగా చేయబడిన రాళ్ల చే నిర్మితమై ఉంటాయి. వీటిలో కొ న్నింట అగ్ని పర్వతాలు జనిస్తాయి.
మరికొన్ని పగడపు పర్వతాలతో నిండి ఉంటాయి. దీవులు సుమారు 750 మీటర్లు గరిష్ఠ ఎత్తు కలిగిన పర్వతాలు.
శీతోష్ణస్థితి వేడిగాను, ఆర్థ్రతగా ఉండుట వలన ఈ ప్రాంతంలో దట్టమైన అడవులతో, కొబ్బరి చెట్లతో నిండి ఉంది.
లక్షదీవులు:
లక్షద్వీపాల సముదాయం అరేబియా సముద్రంలో ఉంది.
ఇవి 27 దీవులను మాత్రమే కలిగి ఉంది. వీటిలో 11 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. 1973లో లక్కా దీవులు, మినికాయ్, అమిన్‌దివి దీవుల సముదాయంను లక్ష ద్వీపములుగా పేరను మార్చారు.
ఈ దీవుల సముదాయం సుమారు 110 చ.కి.మీ వైశాల్యం వరకు విశాలంగా వ్యాపించి ఉన్నాయి.
లక్ష ద్వీపాలు కేరళ తీరంనకు వాయువ్య దిశగా సుమారు 200 నుండి 500 కి.మీ దూరంలో ఉన్నాయి. ఈ దీవులలో పగడములు పెరుగుతాయి.

నదుల వివరాలు..

సింధునది
సింధునది పొడవు 3100 కి.మీ ఉంటుంది. దీని వైశాల్యం 3,21,290 చ.కి.మీ.
సింధునది జన్మస్థానం టిబెట్‌లో కైలాస శ్రేణి 5080 మీ. వద్ద జనిస్తుంది. చివరగా అరేబియా మహా సముద్రంలో కలుస్తుంది. నది వలన భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలు ప్రయోజనం పొందుతున్నాయి.
గంగా నది:
దీనిని భగీరథ అని పిలుస్తారు.
నది పొడవు 2480 కి.మీ ఉంటుంది.
దీని వైశాల్యం 3,37,000 చ.కి.మీ
గంగా నది గౌముఖ్‌లో జనిస్తుంది.
చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది.
దీని వలన ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి.
యమున నది:
దీనిని జమున అని కూడా పిలుస్తారు.
మొత్తం 1370 కి.మీ మేర ఈ నది ప్రవహిస్తుంది. 3 లక్షల 59 వేల చ.కి. మీ వైశాల్యం కలిగి ఉంది.
యమున నది యమునోత్రిలో గల గార్వాల్‌లో జనిస్తుంది. చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ నదితో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి.
బ్రహ్మపుత్ర నది
ఈ నది పొడవు 725 కి.మీ ఉంటుంది.
మొత్తం వైశాల్యం 2,40,000 చ.కి.మీ ఉంటుంది. బ్రహ్మపుత్ర నది మానస సరోవర్ సరస్సు వద్ద జనిస్తుంది.
చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈశాన్య రాష్ట్రాలు ఈ నదితో ప్రయోజనం పొందుతున్నాయి.

కావేరి నది:
దీనికి దక్షిణ గంగ అనే పేరు కలదు.
ఈ నది మొత్తం పొడవు 805 కి.మీ
దీని వైశాల్యం 87,900 చ.కి.మీ ఉంటుంది. కావేరి నది కర్ణాటకలోని కూర్గ్ కొండల్లో జనిస్తుంది.
చివరికి ఈ నది బంగాళా ఖాతంలో కలుస్తుంది. ప్రయోజనం పొందే రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు.

గోదావరి నది:
గోదావరి నది మొత్తం పొడవు 1465 కి.మీ దీని వైశాల్యం 3,12,812 చ.కి.మీ ఉంటుంది. దీని జన్మస్థానం నాసిక్ కొండలు
చివరికి బంగాళా ఖాతంలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయోజనం పొందుతున్నాయి.

కృష్ణానది:
ఈ నది 1400 కి.మీ మేర ప్రవహిస్తుంది. దీని వైశాల్యం 2,59,000 చ.కి.మీ
ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద జన్మించి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది వలన మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి.

నర్మద నది:
ఈ నది 1312 కి.మీ ప్రవహిస్తుంది.
దీని వైశాల్యం 98,796 చ.కి.మీ
నర్మదనది మధ్యప్రదేశ్‌లో అమర్‌కంటక్‌లో జన్మించి చివరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది.
దీని ద్వారా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి.

తపతి నది:
దీని పొడవు 724 కి.మీ ఉంటుంది.
దీని వైశాల్యం 65,145 చ.కి.మీ ఉంటుంది
తపతి నది జన్మస్థానం బెట్టూల్..చివరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది.
ప్రయోజనం పొందే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.

మహానది:

మహానది పొడవు 858 కి.మీ, దీని వైశాల్యం 1,41,600 చ.కి.మీ ఉంటుంది. అమర్‌కంటక్ పీఠభూమిలో మహానది జనిస్తుంది..చివరగా ఈ నది బంగాళాఖాతంలో కలుస్తుంది.
దీని ద్వారా చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి.

వైగైనది:
దీని పొడవు 240 కి.మీ , వైశాల్యం 7000 చ.కి.మీ ఉంటుంది.
వైగైనది కార్డమాన్ కొండలలో జనించి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది.
దీని ద్వారా తమిళనాడులో గల మదురై, రామనాధపురం ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది.

పెరియార్ నది:
దీని పొడవు 244 కి.మీ..వైశాల్యం 5,398 చ.కి.మీ ఉంటుంది.
పెరియార్ నది కార్డమాన్ కొండల్లో జనించి…చివరగా బంగాళా ఖాతంలో కలుస్తుంది. దీని ద్వారా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి.

పరణి నది:
ఇది 123 కి.మీ ప్రవహిస్తుంది. దీని వైశాల్యం 4,400 చ.కి.మీ ఉంటుంది.
ఇది అగస్తియర్ కొండల్లో జనించి చివరగా మన్నార్ సింధుశాఖలో కలుస్తుంది.
దీని ద్వారా తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతం ప్రయోజనం పొందుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News