Monday, December 23, 2024

రూపాయి @ 80!

- Advertisement -
- Advertisement -

డాలర్‌తో పోలిస్తే దారుణంగా పతనమవుతున్న భారతీయ కరెన్సీ
న్యూఢిల్లీ : డాలర్‌తో పోలిస్తే రూపాయి మా రకం విలువ పతనం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగు రోజులుగా పతనమవుతూ ఉన్న రూపాయి 9 పైసలు నష్టపోయి 79.90 వ ద్దకు చేరుకుంది. మరోవైపు అమెరికా కరెన్సీ డాలర్ బలపడుతూ ఉంది. గురువారం డాలర్ పై రూపాయి విలువ 79.90కి చేరుకుంది. అం టే దాదాపుగా భారతీయ కరెన్సీ విలువ 80కి చేరినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించిన నెల ఫిబ్రవరి నుంచి 27 సార్లు రూపాయి పతనమైంది. ఈ నెలలో డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ ఆరు సార్లు సరికొత్త కనిష్టానికి పడిపోయింది.
వినియోగదారులపై ఎలాంటి ప్రభావం
ద్రవ్యోల్బణం ఒత్తిడితో సతమతమవుతున్న భారత్‌కు తాజాగా రూపాయి పతనం మరింత ప్రభావం చూపనుంది. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత ప్రతికూలమే అవుతుంది. తక్కువ డబ్బును ఖర్చు చేసే కుటుంబాల వ్యయ నిర్ణయాలను ప్రభావితం చేసింది.
డాలర్ మారకంలో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే బలహీనపడిన రూపాయి వల్ల వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ప్యాక్ చేసిన ఆహార వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటికి ధరలు మరింత పెరగొచ్చు. దీంతో పాటు విదేశీ విద్య, పర్యటనలు మరింత ప్రియం అవుతాయి.
అమెరికాలో విద్య, పర్యటనల ఖర్చు గత ఆరు నెలల్లో ఏడు శాతం పెరిగింది. రూపాయి మరింత బలహీనపడడం వినియోగదారులపై ఒత్తిడిని పెంచుతుంది.
ఉక్రెయిన్ష్య్రా యుద్ధం తర్వాత నుంచి రూపాయి పతనం ప్రారంభమైంది. మార్చిలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 77కు పడిపోయింది. అప్పటి నుంచి సరికొత్త కనిష్టాలకు పతనమవుతూ వస్తోంది. ఇప్పుడు కీలక 80 మార్క్‌కు క్షీణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News