Monday, December 23, 2024

ఏసియన్ గేమ్స్ క్రీడాకారిణి ఇషా సింగ్‌కు శాట్స్ ఛైర్మన్ అభినందన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చైనాలో జరుగుతున్న 19వ ఏసియన్ గేమ్స్‌లో షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్, 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో రజత పతకం సాధించిన ఇషాసింగ్‌ను తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అభినందించారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు క్రీడాప్రొత్సాహక విధానాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ ఖ్యాతిని విశ్వవేదికలపై విజయవంతంగా ఆవిష్కరిస్తున్న ఇషాసింగ్ లాంటి క్రీడా కారులకు సిఎం కెసిఆర్ అండదంలు, ఆశీస్సులు ఎళ్లవేళలా ఉంటాయని డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. తెలంగాణకు చెందిన ఇషాసింగ్ 22 ఏండ్ల వయస్సులోనే అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి తెలంగాణకు తద్వారా ఇండియాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నారని ఛైర్మన్ ప్రశంసించారు. ఇటీవల తనను కలిసిన ఇషాసింగ్‌కు అభినందన తెలుపుతూ ఈ మేరకు ఆంజనేయగౌడ్ లేఖను రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News