Wednesday, January 22, 2025

ఫైనల్లో స్వప్నిల్

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం ఖా యమయ్యేలా కనిపిస్తోంది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభా గం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. దీంతో షూటింగ్‌లో మరో పతకంపై ఆశలు చిగురించాయి. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వప్నిల్ ఏడో స్థా నంలో నిలిచి ఫైనల్లో ప్రవేశించాడు. ఇదే సమయం లో ఈ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత షూటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఫైనల్ పోరు గు రువారం మధ్యాహ్నం జరుగనుంది.

క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వప్నిల్ అసాధారణ ఆటతో అలరించాడు. అద్భుత ప్రతిభను కనబరిచిన స్వప్నిల్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. స్వప్నిల్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కెరీర్ ఆరంభించిన 12 ఏళ్ల తర్వాతి స్వప్నిల్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. కాగా, స్వప్నిల్ భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్‌ని చూసి ప్రేరణ పొందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News