Wednesday, January 22, 2025

టైటిల్ పోరుకు ప్రణయ్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ : ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో ప్రణయ్ భారత్‌కే చెదిన ప్రియాన్షు రజావత్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన ప్రణయ్ 2118, 2112 తేడాతో రజావత్‌ను ఓడించాడు. తొలి గేమ్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది.

ఇటు ప్రణయ్ అటు రజావత్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. దీంతో తొలి సెట్‌లో హోరాహోరీ తప్పలేదు. ఒక దశలో రజావత్ ఆధిక్యం కూడా కనబరిచాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన ప్రణయ్ ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మళ్లీ పైచేయి సాధించాడు. రజావత్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో మాత్రం ప్రణయ్‌కు ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఈసారి ఆరంభం నుంచే ప్రణయ్ దూకుడును ప్రదర్శించాడు.

రజావత్‌కు కనీసం కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన ప్రణయ్ లక్షం దిశగా అడుగులు వేశాడు. ఇక రజావత్ ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమయ్యాడు. వరుస తప్పిదాలకు పాల్పడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన ప్రణయ్ వరుసగా రెండు సెట్లు గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో చైనా ఆటగాడు వెంగ్‌తో ప్రణయ్ తలపడుతాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News