- Advertisement -
ఒట్టావో: భారత్‌కు చెందిన సిక్కు మతస్థుడిని కెనడాలో హత్య చేశారు. వ్యవస్థీకృత నేరాల్లో పేరుగాంచిన ఓ గ్యాంగ్ ఆ వ్యక్తిని వెంటాడి చంపారు. ఈ దాడిలో ఆ సిక్కువ్యక్తికి చెందిన 11 ఏళ్ల కుమారుడు కూడా హతమయ్యాడు. ఎడ్మంటన్ పట్టణంలో జరిగిన గ్యాంగ్ హింసలో ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 41 ఏళ్ల హర్‌ప్రీత్ సింగ్ ఉప్పల్, అతని కుమారుడిని ఓ గ్యాస్ స్టేషన్ సమీపంలో కాల్చిచంపారు. హర్‌ప్రీత్ కుమారుడికి చెందిన స్నేహితుడు ఆ సమయంలో కారులో ఉండడంతో ఈ దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు.
- Advertisement -