Wednesday, January 22, 2025

అమెరికా,  కెనడాలో భారతీయ గూఢచర్య నెట్వర్క్ పనిచేస్తోంది: పన్నున్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: విదేశీ గడ్డ మీద అసమ్మతివాదుల గొంతు నొక్కే మోడీ ప్రభుత్వంపై అమెరికా, కెనడా కఠినంగా వ్యవహరించాలని ‘సిక్స్ ఫర్ జస్టిస్’(ఎస్ఎఫ్ జె) నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నున్ అన్నారు.

తన దగ్గర ఆధారాలు లేనప్పటికీ, అమెరికా, కెనడాలో భారతీయ దౌత్యకార్యాలయం ‘స్పై నెట్ వర్క్’ నడుపుతున్నట్లు పన్నున్ ఆరోపించారు. అయితే పన్నున్ భారతీయ గూఢచర్య నెట్ వర్క్ గురించి పెద్దగా ఏమీ వివరించలేదు. అమెరికా, కెనడాలోని సిక్కు కార్యకర్తలు ఆరోపించినట్లే నిరాధార ఆరోపణలు చేశారు. అయితే పన్నున్ ఆరోపణలపై అమెరికా, కెనడా అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

విదేశాల్లో ఖలిస్థాన్ మద్దతు పెరిగితే అది పంజాబ్ లో తిరుగుబాటు వాదానికి ఊతం కాగలదని భారత్ భావిస్తోంది. చాలా ఏళ్ల క్రితం సిక్కుల తిరుగుబాటు పంజాబ్ రాష్ట్రాన్ని దెబ్బతీసింది. అక్కడే సిక్కు జాతీయవాదం ఊపిరిపోసుకుంది. ప్రత్యేక ఖలిస్థాన్ కావాలంటూ అక్కడ తీవ్ర ఉద్యమమే నడిచింది. ప్రస్తుతం పన్నున్ అమెరికా,కెనడా, యూరొప్ దేశాలలో ఖలిస్థాన్ ఏర్పాటు విషయమై స్వతంత్ర రెఫరెండమ్(ప్రజాభిప్రాయ సేకరణ) చేస్తున్నారు. తమకు ప్రాణ హాని బెదిరింపులు ఉన్నప్పటికీ తమ ఉద్యమం కొనసాగగలదని పన్నున్ స్పష్టం చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News