Wednesday, January 22, 2025

ఒడిదుడుకుల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. వారంలోని ఐదు సెషన్లలో సూచీలు మొత్తంగా నష్టాలను చవిచూశాయి. అయితే భారత్ జిడిపి, ద్రవ్యోల్బణం గణాంకాలు మెరుగవ్వడం, మరోవైపు అమెరికాలో రుణ పరిమితి అనుమతి పొందడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చాయి. దీంతో సూచీలు లాభాల ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి.

అయితే బిఎస్‌ఇ సెన్సెక్స్ సోమవారం 62,891 పాయింట్ల వద్ద ఉండగా, వారాంతం శుక్రవారానికి ఇది 62,525 పాయింట్లకు పడిపోయింది. అంటే సెన్సెక్స్ గతవారంలో 366 పాయింట్ల నష్టపోయింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే 18,629 పాయింట్ల నుంచి వారాంతానికి 18,523 పాయింట్లకు నష్టపోయింది. అంటే నిఫ్టీ గతవారం 103 పాయింట్లు కోల్పోయింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ, ఎఫ్‌పిఐ) శుక్రవారం భారతీయ ఈక్విటీ మార్కెట్లలో రూ.658 కోట్లు అమ్మకాలు జరపగా, మరోవైపు దేశీయ ఇన్వెస్టర్లు (డిఐఐ) రూ.581 కోట్ల కొనుగోళ్లు నిర్వహించారు. గత నెల రోజులుగా భారత్ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు ప్రవాహం కొనసాగుతోంది.

అయితే మే చివరి వారంలో కొంత అమ్మకాలు కనిపించాయి. దీంతో శుక్రవారం మార్కెట్‌లో లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 62,547 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 18,534 స్థాయి వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 17 లాభపడగా, 13 క్షీణించాయి. మార్కెట్‌లోని అన్ని రంగాలలో వృద్ధి కనిపించింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్స్, ఆటో, మెటల్, రియాల్టీ, ఫార్మా సహా చాలా వరకు సూచీలు లాభాల్లో ముగిశాయి. రియాల్టీ ఇండెక్స్ అత్యధికంగా 1.42 శాతం, మెటల్స్ 1.22 శాతం పెరిగాయి. ట్రేడింగ్‌లో ఐటీ ఇండెక్స్ మాత్రమే 0.40 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.67 శాతం క్షీణించాయి. కోల్ ఇండియా కోల్ ఇండియాలో ఒఎఫ్‌ఎస్ ద్వారా 3 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News