Monday, December 23, 2024

గల్లీ క్రికెటర్లతో ఇండియన్‌ స్ట్రీట్ ప్రీమియర్‌ లీగ్‌.. రామ్ చరణ్, సూర్య సందడి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర వేదికగా మరికాసేపట్లో ఇండియన్‌ స్ట్రీట్ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం కానుంది. ఐపిఎల్ తరహాలో టీ-10 టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ను నిర్వహిస్తున్నారు. గల్లీలో టెన్నిస్‌ బాల్‌తో ఆడే ఆటగాళ్లతో ఈ మెగా ఈవెంట్‌ ను సరికొత్తగా ప్రారంభిస్తున్నారు. ఇందులో 6 జట్లు తలపడనున్నాయి. మొత్తం 96 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు.

ఈ మెగా టోర్నీలో హైదరాబాద్‌ టీమ్‌ ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ కొనుగోలు చేయగా…శ్రీనగర్ టీమ్ ను అక్షయ్‌కుమార్‌, బెంగళూరు టీమ్ ను హృతిక్‌ రోషన్‌, ముంబై టీమ్ ను అమితాబ్‌ బచ్చన్‌, చెన్నై టీమ్ ను సూర్య, కోల్‌కత్తా టీమ్ ను సైఫ్‌అలీఖాన్‌ కొనుగోలు చేశారు. బుధవారం మ్యాచ్ కు ముందు సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, సూర్య, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ లు..నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో ముంబై, శ్రీనగర్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ థానేలోని దాదోజీ కొండదేవ్‌ స్టేడియంలో జరుగనుంది. ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 2 టీవీ ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News