Friday, March 21, 2025

అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూయార్: హమాస్‌కు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలతో భారత్‌కు చెందిన కొలంబియా విద్యార్థి స్వీయ బహిష్కరణకు గురైన వారంలోపే, అమెరికాలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా చేరిన భారతీయుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని ఓ మీడియా నివేదిక తెలిపింది. బదర్ ఖాన్ సూరి అనే ఆ విద్యార్థి న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామీయ పూర్వ విద్యార్థి. సూరి భార్య పాలస్తీనా వారసత్వం కలిగినందున అతడిని ఈ విధంగా శిక్షిస్తున్నారని ఆయన తరఫు లాయర్ అన్నారు. ఇజ్రాయెల్ విషయంలో అమెరికా విదేశాంగ విధానంను వారు వ్యతిరేకించొచ్చని ప్రభుత్వం అనుమానిస్తోందని ఆయన తెలిపారు. వర్జీనియాలోని అతడి ఇంటి ముందు సోమవారం రాత్రి మాస్క్ ధరించి వచ్చిన ఏజెంట్లు అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన లాయర్ హసన్ అహ్మద్ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News