Sunday, December 22, 2024

ఇటలీలో భారతీయ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

రోమ్: ఇటలీలో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి చనిపోయాడు. పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ అనే విద్యార్థి ఎంబిఎ చదివేందుకు ఇటలీ వెళ్లాడు. ఇటలీలో ఓ అద్దె ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తల్లిదండ్రులు అతడికి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటి యజమానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. రామ్ బాత్రూమ్‌లో చనిపోయి కనిపించాడని ఇంటి యజమాని సమాచారం ఇచ్చాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన కుమారుడి మృతదేహం భారత్‌కు తీసుకరావాల్సిందిగా ఝార్ఖండ్ ప్రభుత్వానికి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఝార్ఖండ్ మైగ్రేషన్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News