Sunday, December 22, 2024

అమెరికన్ పోలీస్ కండకావరం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమెరికన్ పోలీస్ కండకావరం మరోసారి బట్టబయలైంది. ఈ ఏడాది జనవరిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని ఓ భారతీయ సంతతికి చెందిన మహిళ అమెరికాలో దుర్మరణం పాలైన సంగతి విదితమే. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీసు అధికారి నవ్వుతూ, హేళనగా మాట్లాడటం అతని బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో సీటెల్ పోలీసు యూనియన్ లీడర్లపై దర్యాప్తు ప్రారంభించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 23 సంత్సరాల కందుల జాహ్నవి సౌత్ లేక్‌లోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువు కుంటోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 23న థామస్ స్ట్రీస్‌లోని డెక్స్‌టర్ అవెన్యూ నార్త్ సమీపంలో జాహ్నవి రోడ్డుపై నడుస్తుండగా కెవిన్ డేవ్ అనే సీటెల్‌కు చెందిన పోలీసు అధికారి ఆడెరర్ నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో జాహ్నవి తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ క్రమంలో జాహ్నవి మృతిపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరెర్ కారు నడుపుతూ చేసిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది.

గిల్ అధ్యక్షుడు మైక్ సోలన్‌తో ఫోన్‌లో ఆడరర్ మాట్లాడుతూ జాహ్నవి విలువ చాలా తక్కువ అంటూ ఆమె ప్రాణానికి విలువే లేదంటూ ఎగతాళిగా కామెంట్ చేశాడు. ఆమె చనిపోయింది అంటూ గట్టిగా నవ్వడమే గాక ఇదంతా మామూలే అంటూ భారతీయ విద్యార్థిని మరణాన్ని చాలా తేలికగా తీసిపారేశాడు. 11,000 డాలర్లకు చెక్ రాస్తే చాలు ఆమెకు 26 ఏళ్లు. ఆమెకు విలువ చాలా తక్కువ అంటూ ఆడెరర్ చేసిన వ్యాఖ్యలు.. భారతీయ విద్యార్థిని పట్ల ఒక అమెరికన్ పోలీసుకు ఉన్న చిన్న చూపు (రేసిజం) ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది. కారును గంటకు 50 మైళ్ల వేగంతో నడుపుతున్నాడని, ఒక శిక్షణ పొందిన డ్రైవర్‌కు అది చాలా తక్కువ వేగమని కూడా ఆడరర్ సర్టిఫై చేశాడు. అయితే, జాహ్నవి మరణంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో డేవ్ గంటకు 74 మైళ్ల వేగంతో కారు నడిపినట్లు తేలింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గంలకు 25 మైళ్లకు మించి వేగంగా వాహనాలు నడపడానికి వీల్లేదు. డేవ్ వేగంగా నడిపిన కారు ఢీకొని జాహ్నవి 100 అడుగుల మేర దూరంలో ఎగిరిపడి మరణించింది. ఆడెరర్ వీడియో సంభాషణకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు, ప్రవాస భారతీ యలు మండిపడుతున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీటెల్ పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాహ్నవి కందుల సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థిని. ఈ డిసెంబర్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకునేది. జాహ్నవి ప్రమాదానికి గురైన సమయంలో డేనియల్ 119 కిలోమీటర్ల వేగంతో కారు నడపినట్లు తేలింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అమ్మాయి ప్రాణానికి విలువ లేదని, నష్ట పరిహారంగా ఒక చెక్ అందజేస్తే చాలు అన్నట్లుగా అతడు మాట్లాడిన తీరుపై విమర్శలు వ్యక్తమవు తున్నాయి. దీనిపై స్థానిక మీడియా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో సంభాషణ వైరల్ కావడంతో పోలీసు డిపార్ట్‌మెంట్ కూడా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News