Wednesday, January 22, 2025

లండన్‌లో భారతీయుడి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చదువుకునేందుకు లండన్ వెళ్లిన ఓ భారత యువకుడు శవమై తేలాడు. ఇండియాకు చెందిన 23 ఏళ్ల మీత్ కుమార్ పటేల్ సెప్టెంబర్ 19న లండన్ వెళ్లాడు. వరసకు సోదరుడయ్యే వ్యక్తితో కలసి తూర్పు లండన్ లోని ప్లైస్టో అనే ప్రాంతంలో ఉంటున్నాడు. పటేల్ నవంబర్ 20న షెఫీల్డ్ హాలమ్ యూనివర్శిటీలో చేరవలసి ఉంది. అమెజాన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. అయితే, రోజూ మార్నింగ్ వాక్ కు వెళ్లే అలవాటున్న పటేల్ నవంబర్ 17న కూడా వాక్ కి వెళ్లాడు. కానీ ఇంటికి తిరిగిరాలేదు. దాంతో అతని కజిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల తర్వాత అతని మృతదేహం కలెడోనియన్ వార్ఫ్ అనే ప్రాంతంలో నది ఒడ్డున పోలీసులకు లభించింది. పటేల్ మరణానికి కారణం తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News