Tuesday, January 21, 2025

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో చ దువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి ఈ నెల 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్ల్లీవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహమ్మద్ సలీం వెల్లడించారు. వారు 1,200 డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని,  లేనిపక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని బెదిరించినట్లు తెలిపా రు. తాము దానికి అంగీకరించి అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపమని అడిగామ ని పేర్కొన్నారు. దీనికి కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్ పెట్టేశారని, మళ్లీ కాల్ చేయలేదని వెల్లడించారు. కానీ కిడ్నాపర్ మాట్లాడటానికి ముందు ఫోన్‌లో ఏడుపు వినిపించిందన్నారు. ఈ నెంబర్‌ను అమెరికాలోని తమ బంధువులకు పంపించామని,దానిని క్లేవ్‌ల్యాండ్ పోలీసులకు అందజేయాలని చెప్పినట్లు తెలిపారు.

క్లీవ్‌ల్యాండ్‌లో డ్రగ్స్ అమ్మే ముఠానే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. అబ్దుల్ మహమ్మద్ అదృశ్యమైన విషయంపై అతడి బంధువులు ఈ నెల 8న క్లేవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఒక లుకౌట్ నోటీసు జారీ చేశారు. మరోవైపు అతడి కుటుంబసభ్యులు మార్చి 18వ తేదీన చికాగోలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించి, తమ కుమారుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక విద్యార్థి తల్లి మాట్లాడుతూ తన కుమారుడితో చివరిసారిగా ఈ నెల 7వ తేదీన మాట్లాడినట్లు తెలిపారు. తన కొడుకు ఎక్కడున్నాడో పోలీసులు దర్యాఫ్తు చేయాలని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అమెరికాలోని చికాగోలో హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీపై కూడా గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ విద్యార్థి ఇండియానా వెస్లయన్ విశ్వవిద్యాలయంలోచదువుతున్నాడు. అక్కడి భారత దౌత్య కార్యాలయం ఆ విద్యార్థికి అవసరమైన సాయం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News