Wednesday, January 22, 2025

భారతీయ విద్యార్థిపై ఖలీస్థానీల దాడి

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాలో ఖలీస్థాన్ తీవ్రవాదులు రెచ్చిపొయ్యారు. ఓ భారతీయ విద్యార్థిపై దాడికి దిగారు. ఇనుప రాడ్లతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. 23 ఏండ్ల ఈ విద్యార్థి మేరీల్యాండ్స్‌లోని సిడ్నీ శివార్లలో దాడికి గురయ్యాడు. కారులో వెళ్లుతున్న ఈ వ్యక్తిని అటకాయించిన దుండగులు బయటకు లాగి కొట్టినట్లు ఆస్ట్రేలియా టుడే న్యూస్‌పోర్టల్ తెలిపింది. ఈ విద్యార్థి పేరు వెలుగులోకి రాలేదు. ఖలీస్థానీ తీవ్రవాదంపై తాను ఉద్యమిస్తున్నందునే తనపై దాడి జరిగిందని ఈ విద్యార్థి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News