కీవ్ : ఉక్రెయిన్ రష్యా జవాన్ల మధ్య జరుగుతున్న పోరులో భారత దేశానికి చెందిన మరో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ శుక్రవారం వెల్లడించారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి వీకేసింగ్ పోలాండ్ వెళ్లారు. అక్కడ నేడు మీడియాతో మాట్లాడుతూ కీవ్‌ను వీడి సరిహద్దులకు వస్తుండగా నేడు ఓ భారత విద్యార్థి కాల్పుల్లో గాయపడ్డాడని సమాచారం వచ్చింది. సైనికుల మధ్య పోరులో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆ విద్యార్థిని కీవ్ లోని ఆస్పత్రికి తరలించారని వీకే సింగ్ వెల్లడించారు. ఇటీవల ఖర్కివ్‌లో జరిగిన క్షిపణి, బాంబు దాడుల్లో కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థుల తరలింపు ప్రక్రియను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 17 వేల మంది భారత పౌరులు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో దాదాపు 6 వేల మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు.
ఉక్రెయిన్‌లో కాల్పులు.. మరో భారత విద్యార్థికి గాయాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -