న్యూయార్క్: టోరంటోలో అజ్ఞాత వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పులలో తీవ్రంగా గాయపడిన 21 సంవత్సరాల భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ మరణించారు. ఈ సంఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం టోరంటోలోని స్థానిక సబ్‌వే స్టేషన్ వెలుపల కాల్పులు జరిగినట్లు తమకు రేడియో కాల్ వచ్చిందని టోరంటో పోలీసు సర్వీస్ తెలిపింది. ఈ కాల్పులలో కార్తీక్ వాసుదేశ్ తీవ్రంగా గాయపడ్డారని, వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎవరైనా సాక్షులు ఉన్నారా అన్న విషయమై ఆరా తీస్తున్నామని, అంతేగాక అక్కడ ఏ వ్యాపార సంస్థకైనా సిసి టివి ఫుటేజ్ ఉందా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా..ఈ సంఘటనపై టోరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడు కార్తీక్ వాసుదేవ్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని భారత్‌కు త్వరగా పంపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
టోరంటో కాల్పులలో భారతీయ విద్యార్థి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -