Sunday, January 19, 2025

చికాగోలో జాడ తెలియని హైదరాబాద్ విద్యార్థి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి జాడ తెలియడం లేదు. 26 సంవత్సరాల తెలంగాణ యువకుడు చింతకింది రూపేష్ చంద్ర ఈ నెల రెండవ తేదీ నుంచి ఆచూకీ లేకపోవడం, ఆయన నుంచి ఎవరికి ఫోన్లు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విద్యార్థి గల్లంతు గురించి చికాగోలోని భారతీయ దౌత్యకార్యాలయం గురువారం ప్రకటన వెలువరించింది. ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు నగరాలలో భారతీయ విద్యార్థుల అదృశ్యం, హింసాత్మక ఘటనలలో చనిపోవడం, ప్రమాదాల బారిన పడటం పైగా కొన్ని చోట్ల సైకోల దాడికి కూడా గురికావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్ర కన్పించకుండా పోవడం ఆందోళనకు దారితీసింది. చికాగోలోని ఎన్ షెరిడన్ రోడ్ ప్రాంతపు 4300 బ్లాక్ నుంచి ఈ విద్యార్థి కన్పించకుండా పొయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తాము ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులు, భారతీయ సంతతి, చంద్ర స్నేహితులు, బంధువులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చికాగోలోని భారతీయ కాన్సులేట్ వర్గాలు తెలిపాయి. రూపేష్ చంద్ర విస్కాన్‌సిన్‌లోని కాంకోర్డియా వర్శిటీలో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.

రమేష్ కుటుంబం హైదరాబాద్‌లో ఉంటోంది. కుమారుడి యోగక్షేమాలు తెలియక తాము తల్లడిల్లుతున్నామని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి కాలంలో అమెరికాలోని భారతీయ విద్యార్థులు , ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. విషాదాంతాలకు దారితీస్తున్నాయి. హైదరాబాద్ నాచారంకు చెందిన పాతికేళ్ల యువ విద్యార్థి మెహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ మార్చి నుంచి కన్పించకుండా పొయ్యాడు. తరువాత క్లెవ్‌లాండ్‌లో ఆయన శవం దొరికింది. గత ఏడాదే ఈ యువకుడు ఇక్కడ ఎంఎస్ చేయడానికి వచ్చాడు. కాగా మార్చిలోనే భారతదేశానికి చెందిన శాస్త్రీయ నృత్య కళాకారుడు , 34 సంవత్సరాల అమర్‌నాథ్ ఘోష్‌ను దుండగులు మిసోరిలోని సెయింట్ లూయిస్ ప్రాంతంలో చంపివేశారు. ఫిబ్రవరి 2న భారతీయ సంతతికి చెందిన ఐటి ఉద్యోగి వివేక్ తనేజాపై వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్ వెలుపలే తీవ్రస్థాయి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ప్రాణాంతక గాయాలు అయ్యాయి.

జనవరిలో 18 సంవత్సరాల అకుల్ ధావన్ ఓ క్యాంపస్ భవనంలో అచేతన స్థితిలో పడి ఉండగా గుర్తించారు. ఆయన భారీ స్థాయి మంచుతాకిడి సంబంధిత హైపోధెర్మియాతో చనిపోయినట్లు నిర్థారించారు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, తరువాత ఎముకలు కొరికే స్థాయి చలిలో ఉండాల్సి రావడం ఆయన మృతికి దారితీసిందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News