Monday, December 23, 2024

ఉక్రెయిన్ నుంచి బెంగళూరుకు భారత విద్యార్థి భౌతిక కాయం

- Advertisement -
- Advertisement -

Indian student physical body from Ukraine to Bangalore

బెంగళూరు: ఉక్రెయిన్ లోని ఖర్కివ్‌లో రష్యా జరిపిన దాడిలో మరణించిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప భౌతిక కాయం.. సోమవారం తెల్లవారు జామున ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చదువుతున్న నవీన్.. మార్చి 1న ఖర్కివ్‌లో జరిగిన పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయాడు.

బెంగళూరు విమానాశ్రయంలో అతడి పార్థివ దేహానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై నివాళులు అర్పించారు. భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. రష్యా దాడిలో నవీన్ ప్రాణాలు కోల్పోవడం తనను కలచి వేసిందన్నారు. నవీన్ మృతదేహాన్ని పరిశోధనల కోసం దేవనాగరెలోని వైద్య కళాశాలకు దానం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News