Friday, November 22, 2024

యుఎఇ గోల్డెన్ వీసాకు భారత విద్యార్థిని ఎంపిక

- Advertisement -
- Advertisement -

Indian student selected for UAE Golden Visa

దుబాయ్: ప్రముఖులకు మాత్రమే లభించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) గోల్డెన్ వీసాకు ఓ భారతీయ విద్యార్థిని ఎంపికయ్యారు. కేరళకు చెందిన తస్నీమ్ అస్లామ్‌కు ఆ గౌరవం దక్కింది. ఉన్నత విద్యలో ఆమె కనబరిచిన ప్రతిభ ఆధారంగా గోల్డెన్ వీసాకు ఆమె ఎంపికయ్యారు. దాంతో,పదేళ్లపాటు అంటే 2031 వరకు యుఎఇలో ఆమె ఎలాంటి ఇతర అనుమతులు లేకుండా విద్య, ఉద్యోగాలను కొనసాగించే వీలు కలుగుతుంది. నా జీవితంలో ఎంతో ఆనందం కలిగించిన క్షణాలంటూ తస్నీమ్ ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. అల్లాకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తన తల్లిదండ్రుల సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. షార్జాలోని అల్ ఖసీమా యూనివర్సిటీలో ఇస్లామిక్ షరియాను ఆమె పూర్తి చేశారు. మొత్తం 4 జిపిఎకు 3.94 పాయింట్లు ఆమె సాధించారు. సంపన్నులు, పరిశోధకులు, సెలెబ్రిటీలకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను ఓ విద్యార్థి పొందడం అరుదైన విషయమన్నది గమనార్హం. ఇటీవల బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు కూడా యుఎఇ గోల్డెన్ వీసా ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News