Sunday, February 23, 2025

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థికి కత్తిపోట్లు

- Advertisement -
- Advertisement -

Indian student stabbed in Australia

సిడ్నీ: భారతీయ విద్యార్థి ఒకరు కత్తిపోట్లకు గురయ్యాడు. డబ్బుకోసం విద్యార్థి ముఖం, ఛాతీ, కడుపులో పలుమార్లు ఓ వ్యక్తి కత్తితో పొడిచాడని అధికారులు తెలిపారు. శుభంగార్గ్ అనే భారతీయ విద్యార్థి పసిఫిక్ హైవేమీదుగా నడిచి వెళుతుండగా రాత్రి 10.30గంటలకు ఈ ఘటన జరిగిందని.. పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 27ఏళ్ల నిందితుడు నార్‌వుడ్‌ను అరెస్టు చేసి హత్యాయత్నం కింద చార్జ్‌షీట్ దాఖలు చేశామని పోలీసులు వెల్లడించారు. శుభంగార్గ్ నుంచి పొత్తికడుపు వరకు కత్తిగాయాలయ్యాయని టెలీగ్రాఫ్ వార్తాపత్రిక నివేదించింది. రాయల్ నార్త్ షోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గార్గ్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని పోలీస్ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. గుర్తుతెలియని ఓ వక్తి శుభంగార్గ్‌ను డబ్బు కోసం డిమాండ్ చేశాడని, డబ్బులు ఇచ్చేందుకు గార్గ్ తిరస్కరించడంతో దాడి చేసి పారిపోయాడని వార్తాపత్రిక నివేదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News