కెనడా: సక్రమంగా ఉన్న భారతీయ విద్యార్థులు కెనడాలో బహిష్కరణలకు గురి కాకుండా తాము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. కెనడాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులపై ఇప్పుడు వేటు ముప్పు ఏర్పడింది. దీనితో వారు అనేకులు వీధులలో నిరసనకు దిగారు. తమపై ఉన్నట్లుండి గెటౌట్ అనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని , భారత అధికార యంత్రాంగం దీనిపై స్పందించాలని కోరుతున్నారు. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ సానుకూలంగా స్పందించారు.
విదేశాంగ శాఖ, భారత హైకమిషన్ వర్గాలు దీనిపై సరైన పరిష్కారానికి చర్యలుతీసుకుంటాయని హామీ ఇచ్చారు. తప్పు చేయని విద్యార్థులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కెనడా వ్యవస్థ ఈ విషయంలో సక్రమంగా ఉంటుందన్నారు. కాగా ఎక్కువగా పంజాబ్ విద్యార్థులు కెనడాలో ఉంటున్నారు. వీరి ప్రస్తుత సమస్య గురించి పంజాబ్ రాష్ట్ర ఎన్‌ఐఆర్ వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలీవాల్ ఇటీవలే జైశంకర్‌కు లేఖ రాశారు. దీనిపై మంత్రి స్పందించారు.