Tuesday, November 5, 2024

కీవ్‌లోని భారతీయ విద్యార్థులు రైల్వే స్టేషన్‌కు వెళ్లాలని సూచన!

- Advertisement -
- Advertisement -

Indian students in Kiev are advised to go to railway station!

 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో చిక్కుబడిపోయిన భారతీయ విద్యార్థులు పశ్చిమ భాగాలకు చేరుకోడానికి కీవ్‌లోని రైల్వే స్టేషనుకు చేరుకోవాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సూచించింది. కీవ్‌లో కర్ఫూ ఎత్తివేసిన కారణంగా ఆ నగరాన్ని వదిలిపెట్టేందుకు రైల్వే స్టేషనుకు వెళ్లాలని పేర్కొంది. “కీవ్‌లో వీక్‌ఎండ్ కర్ఫూను ఎత్తివేశారు. పాశ్చాత్య భూభాగాలకు వెళ్లేందుకు భారతీయ విద్యార్థులందరూ రైల్వే స్టేషనుకు చేరుకోవాలి. ఉక్రెయిన్ రైల్వేస్ తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది” అని రాయబారకార్యాలయం ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండగా భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు ‘ఆపరేషన్ గంగ’ కింద నడుపుతున్న విమానాల్లో ఆరవ విమానం 240 మంది భారతీయులతో బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్ర ఎస్. జైశంకర్ తెలిపారు. తీవ్ర పోరు కొనసాగుతున్న కీవ్ నగరంలో దాదాపు 2000 మంది భారతీయులు ఉన్నారు. ఉక్రెయిన్‌లోని ఘర్షణ ప్రదేశాలైన ఖార్కివ్, సుమీ నుంచి భారతీయులను తరలించడంపై భారత్ దృష్టి పెట్టింది. హంగరీ, పొలాండ్, రొమానియా, స్లోవాకియా సరిహద్దుల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురాడానికి భారత్ ప్రయత్నిస్తోంది. కాగా ఉక్రెయిన్‌కు చెందిన ఎల్వివ్, చెర్నివ్‌ట్సీ పట్టణాల్లో శుక్రవారం క్యాంప్ కార్యాలయాలను భారత్ ఏర్పాటుచేసింది. గగనతలాన్ని ఉక్రెయిన్ మూసేసినందున భారతీయులను తరలించేందుకు భారత్ ల్యాండ్ రూట్‌ను ఎంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News