Monday, April 14, 2025

భారతీయ విద్యార్థులపై మరో బాంబు

- Advertisement -
- Advertisement -

ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఒపిటి)
రద్దు చేసే లక్షంతో అమెరికా
పార్లమెంట్‌లో బిల్లు గ్రాడ్యుయేషన్
తరువాత మూడేళ్ల వరకు అమెరికాలో
పనికి ఒపిటి అనుమతి
భయాందోళనలో భారతీయ
విద్యార్థులు చిన్న తప్పు చేసినా
వీసా రద్దు చేస్తున్న అధికారులు

వాషింగ్టన్ : ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్’ (ఒపిటి) కార్యక్రమం రద్దు ఉద్దేశంతో అమెరికాలో ప్రతిపాదించిన కొత్త బిల్లు అక్కడ ఉన్న త విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో విస్తృత స్థాయిలో భ యాందోళనలు కలిగిస్తోంది. యుఎస్ విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం మూడు లక్షల మంది భారతీయ విద్యార్థుల పేర్లు నమోదై ఉండడం తో, వారిలో అనేక మంది తమ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పిజి) అవకాశాల గురించి అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ విద్యార్థులను, ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమేటిక్స్) రంగాల్లో ఉన్నవారు పట్టభద్రులైన తరువాత మూడు సంవత్సరాల వరకు యుఎస్‌లో పని చేయడానికి ఒపిటి కార్యక్రమం అ నుమతిస్తుంది. తాత్కాలికంగా పని చేసేందుకు అధికారం ఇవ్వడం వల్ల విద్యార్థులు పారిశ్రామిక అనుభవాన్ని గడించి, విద్యా రుణాలను తిరిగి తీర్చగలగడమే కాకుండా, హెచ్1బి వీసా మార్గం ద్వారా దీర్ఘకాలిక ఉద్యోగం సంపాదించే అవకాశాలు మెరుగు అవుతాయి.

బిల్లుపై ఆందోళన ఎందుకు?
వలసదారుల వ్యతిరేక సెంటిమెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లు ఒపిటి రద్దును నిర్దేశిస్తోంది. హెచ్1బి వీసా పొందకపోతే తమ డిగ్రీలు పూర్తి చేసిన తరువాత అంతర్జాతీయ విద్యార్థులు యుఎస్ నుంచి నిష్క్రమించడాన్ని బిల్లు తప్పనిసరి చేస్తుంది. హెచ్1బి లాటరీ ఆధారిత విధానం, వార్షిక పరిమితి దృష్టా తాము వీసా పొందలేకపోవచ్చునని అనేక మంది భయపడుతున్నారు.

యుఎస్‌లో భారతీయ విద్యార్థులపై ప్రభావం
ఒపిటి లబ్ధిదారుల్లో గణనీయ సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులు ప్రధానంగా ఆర్థిక భారం, కెరీర్‌పై అనిశ్చితి, హెచ్1బి సవాళ్లు కారణంగా ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి విషమించక ముందే హెచ్1బి వీసాలు స్పాన్సర్ చేసే సంస్థల నుంచి ఉద్యోగం ఆఫర్ల సంపాదించడం కోసం అనేక మంది విద్యార్థులు తహతహలాడుతున్నారు. అయితే, ఏటా పరిమితంగా వీసాలు మంజూరు చేస్తున్న కారణంగా వారు ఆ విషయంలో కృతకృత్యులు కావడం సందేహమే, ఒపిటి రద్దు అవకాశం ఉండడడంతో వేలాది మంది భారతీయ విద్యార్థుల విద్యా విషయక, వృత్తిపరమైన కలలకు అంతరాయం కలగవచ్చు.

చిన్న తప్పు చేసినా వీసా రద్దు
అతి వేగంగా వాహనం నడిపినందుకు లేదా సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు వీసాలు రద్దు చేస్తున్నారని కొంత మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థులు చిన్న పొరపాటు జరిగినా తమ భవిష్యత్తు అంధకారబంధురం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ‘నేను ఎప్పుడూ భయంతో బతకవలసి వస్తోంది. ఇక్కడ ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు. మా భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది’ అని ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. పేరు వెల్లడికి ఇష్టపడని ఒక విద్యార్థి మాట్లాడుతూ, ‘మా స్నేహితుడు ఒక చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా వీసా కోల్పోయాడు, అతను వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లవలసి వచ్చింది.

ఇది చాలా దారుణంగా ఉంది’ అని చెప్పాడు. అమెరికాలోని కొన్ని కళాశాలలు అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దుకు సంబంధించిన సంఘటనలు పెరుగుతున్నాయని ధ్రువీకరించాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని అవి తెలిపాయి. దీనికి తోడు, అమెరికాలో చదువుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. ట్యూషన్ ఫీజులు, వసతి ఖర్చులు, ఆహార ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీని కారణంగా చాలా మంది విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల విషయంలోను నిరాశే ఎదురవుతోంది. చదువు పూర్తి అయిన తరువాత ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. వీసా నిబంధనలు కఠినంగా ఉండడం, కంపెనీలు విదేశీయులను నియమించుకోవడానికి వెనుకాడడం వంటి కారణాలతో ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయి. దీని వల్ల చాలా మంది విద్యార్థుల చదువు పూర్తి చేసుకుని కూడా స్వదేశానికి తిరిగి వెళ్లవలసి వస్తోంది. భారత ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి, విద్యార్థులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

తక్షణమే దేశం విడిచి వెళ్లకుంటే రోజుకు రూ.86 వేల జరిమానా
అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ యంత్రాంగం తక్షణమే దేశం విడిచి వెళ్లాలని, లేదంటే చర్యలు తప్పవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఆదేశాలు వచ్చిన తర్వాత దేశాన్ని వీడకుంటే రోజుకు రూ. 86 వేల జరిమానా విధించనున్నారని, జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నారని తెలుస్తోంది. అక్రమ వలసదారులు సెల్ఫ్‌డిపోర్టేషన్ యాప్ ద్వారా నమోదు చేసుకుని వెళ్లాలని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సూచిస్తోంది. స్వీయ బహిష్కరణ సురక్షితమని, లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, డీహెచ్‌ఎస్ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్‌లాలిన్ మీడియాతో పేర్కొన్నారు.

సెక్యూరిటీ విభాగం మార్చి 31న సోషల్ మీడియాలో కీలక సమాచారాన్ని వెల్లడించింది. తమ తనిఖీల్లో పట్టుబడితే క్రమబద్ధీకరణకు ఎటువంటి అవకాశం ఉండదని, అప్పటివరకు సంపాదించుకున్న డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది. బహిష్కరణ ఆదేశాలు అందుకున్న తర్వాత వెళ్లిపోని వారు రోజుకు 998 డాలర్ల జరిమానా ఎదుర్కోవలసి ఉంటుందని వివరించింది. సెల్ఫ్ డిపోర్ట్ యాప్‌లో నమోదు చేసుకున్న తరువాత దేశాన్నివీడకుంటే వెయ్యి నుంచి ఐదు వేల డాలర్ల జరిమానా ఉంటుందని తెలిపింది. భవిష్యత్తులో అమెరికాకు తిరిగి వచ్చే అవకాశాన్ని కోల్పోతారని, జైలు శిక్షకూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News