Sunday, February 2, 2025

ఉక్రెయిన్‌లో ఎంబసీ భారతీయ విద్యార్థులకు ఆశ్రయం

- Advertisement -
- Advertisement -

Indian students in Ukraine embassy

కీవ్ (ఉక్రెయిన్): ఉ క్రెయిన్‌లోని అనేక నగరాలపై రష్యా దాడులు ప్రారంభిం చడంతో భారీ ఎత్తు న భారతీయ విద్యా ర్థులు కీవ్ లోని భార త దౌత్య కార్యాల యానికి చేరుకుని తమకు బయట రక్ష ణ, భద్రత కల్పిం చాలని డిమాండ్ చే శారు. దీంతో దౌత్య కార్యాలయం బయ ట విద్యార్థుల కోసం సురక్షిత ప్రాంగణా లు ఏర్పాటు చేయ గా, విద్యార్థులు అక్కడ ఉంటున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. దాదాపు 200 మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పించారు. ఉక్రె యిన్‌లోని భారత రాయబారి పార్థశత్పథి భారతీయ విద్యార్థులను కలిసి వీలైనంతవరకు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. “ఇది మీరంతా చాలా ఉద్వేగానికి గురయ్యే రోజు. మీ విమానం రద్దయిం దని విన్నాం. మీరంతా ఇక్కడే ఉండండి. సైనిక చట్టం అమలులో ఉన్నందున ఎక్కువ మంది ఒకేచోట ఉండకూడదు. అందువల్ల మీకు బయట ఆశ్రయం కల్పిస్తు న్నాం’ అని ఆయన వారికి సూచించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 20 వేల మంది వరకు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News