Friday, December 20, 2024

కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 80 శాతం తగ్గుదల

- Advertisement -
- Advertisement -

ఒట్టావా : భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా బాగా తగ్గించింది. దీనికి కారణం దౌత్యపరమైన విభేదాలే అని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే కెనడా జారీ చేసింది. అంతక్రితం మూడు నెలల వ్యవధిలో ఈ సంఖ్య 1,08,940గా ఉంది. అంటే 86 శాతం వరకు తగ్గింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలకు దారి తీసింది. చివరకు రాయబారుల సంఖ్య తగ్గించుకోవాలని కెనడాకు భారత్ సూచించడానికి దారి తీసింది. దాంతో కెనడా 41 మంది దౌత్యాధికారులను వెనక్కి తీసుకుంది.

ఈ నేపథ్యంలో స్టడీ పర్మిట్లను పెద్ద సంఖ్యలో ప్రాసెస్ చేయడం కుదరడం లేదని కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ ఇటీవల ఓ ఇంటర్వూలో వెల్లడించారు. కెనడాలో చదువుల కోసం వెళ్లే వారిలో ఎక్కువ శాతం మంది భారతీయులే ఉంటున్నారు. 2022లో 2,25, 835 స్టడీ పర్మిట్లు జారీ చయగా, అందులో 41 శాతం భారతీయ విద్యార్థులే పొందగలిగారు. అక్కడి విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థులే ప్రధాన ఆధారం. మరోవైపు విదేశీ విద్యార్థుల వలసలు గణనీయంగా పెరగడంతో కెనడాలోనిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవల మిల్లర్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. తమ దేశంలో నివసించే విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే యోచనలో ఉన్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News