Thursday, November 14, 2024

కొలంబో రేవులో భారత జలాంతర్గామి

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంక ఆదివారం నాడు 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనుండగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ కరంజ్ జలాంతర్గామి గురువారం కొలంబో పోర్టుకు చేరుకుంది. రెండు రోజుల పాటు శ్రీలంక పర్యటనకు వచ్చిన ఈ జలాంతర్గామికి శ్రీలంక నౌకాదళం స్వాగతం పలికింది.53 మంది సిబ్బంది, 67.5 మీటర్ల పొడవుండే ఐఎన్‌ఎస్ కరంజ్ జలాంతర్గామికి కమాండర్ అనునాభ్ కమాండింగ్ అధికారిగా ఉన్నట్లు స్త్రలంక నేవీ తెలిపింది.ఈ జలాంతర్గామి ఈ నెల 5న శ్రీలంకనుంచి బయలుదేరుతుంది. భారత్, శ్రీలంక మధ్య బలపడుతున్న నావికా సంబంధాలకు ఈ జలాంతర్గామి నిదర్శనమని న్యూస్ పోర్టల్ ‘లంకాన్యూస్ వెబ్ డాట్ నెట్’ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య దౌత్య, సాంస్కృతిక మార్పిడి నావికా సంబంధాల రంగంలో ఇరు దేశాల మధ్య విసృత సహకారానికి దోహదపడుతుందని ఆ న్యూస్‌పోర్టల్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News