- Advertisement -
హైదరాబాద్: జర్మనీలో బెర్లిన్ వేదికగా జరిగిన స్పెషల్ సమ్మర్ గేమ్స్‌లో భారత స్విమ్మర్లు పతకాల పంట పండించారు. భారత టీమ్‌కు తెలంగాణకు చెందిన అయుష్ యాదవ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. అయుష్ పర్యవేక్షణలోని స్విమ్మర్లు రికార్డు స్థాయిలో పతకాలు సాదించారు. ఈ క్రీడల్లో భారత్ 16 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 10 రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. మాధవ్ మదన్, దీక్షా సింగాన్కర్, ప్రసిద్ధి ప్రకాశ్ కాంబ్లే, అలీనా ఆంథోనీలు స్వర్ణ పతకాలు సాధించారు.
- Advertisement -