Wednesday, October 16, 2024

ఎమర్జింగ్ ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

 తిలక్ వర్మకు కెప్టెన్సీ..
 అభిషేక్ శర్మ, ఆయుష్ బదోనిలకు చోటు
ముంబై: మరో నాలుగు రోజుల్లో మరో క్రికెట్ సంగ్రామానికి తెరలేవనుంది. ఒమన్ వేదికగా శుక్రవారం ఎమర్జింగ్ ఆసియా కప్ షురూ కానుంది. తొలిసారి టి20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ మెగాటోర్నీకి భారత జట్టును ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు. 15 మందితో కూడిన భారత్‌ఎ జట్టును ఎంపిక చేశారు సెలెక్టర్లు. కాగా, ఈ బృందానికి తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఐపిఎల్ బ్యాట్ చెలరేగే స్టార్ ఆటగాళ్లకు జట్లుకి తీసుకున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ, సీనియర్ ప్లేయర్ రాహుల్ చాహర్‌లను తుది జుట్టులో స్థానం కల్పించారు. ఐపిఎల్ గత సీజన్‌లో మెరిసిన యువ ఆటగాళ్లకు జట్టులో ప్రధానంగా చోటు దక్కింది. యువ ఆటగాళ్లు రమన్‌దీప్ సింగ్ (కెకెఆర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్‌సిబి) ఎంపికయ్యారు. బౌలర్లుగా ఆర్ సాయి కిశోర్ (గుజరాత్ టైటాన్స్), హృతిక్ షోకీన్, రసీక్ సలామ్ (ఢిల్లీ క్యాపిటల్స్), వైభవ్ అరోరా (కెకెఆర్), అకీబ్ ఖాన్ స్థానం దక్కించుకున్నారు. 2022 అండర్-19 ప్రపంచకప్ విజేత, ఆల్‌రౌండర్ నిశాంత్ సింధుకు అవకాశం కల్పించారు.

కాగా, ఎమర్జింగ్ ఆసియా కప్‌లో మొత్తం 8 దేశాలు తలపడనున్నాయి. గ్రూప్‌ఎఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బిలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు ఆయా గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడనుంది. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, 27న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్-ఎ వివరాలు..
తిలక్ వర్మ (కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అభిషేక్ శర్మ, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, రాహుల్ చాహర్, సాయి కిశోర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News