Saturday, January 4, 2025

2025లో బిజీ బిజీగా భారత్

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రతిష్టాత్మక బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్‌లో ఓటమితో 2024 సంవత్సరాన్ని ముగించిన భారత్ ఈనెల 3 నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో చివరి టెస్ట్‌తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభించనుంది. అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టి20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్‌లో పర్యటించనుంది. కోల్‌కతా వేదికగా జనవరి 22-న తొలి టి20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం చెన్నైలో జనవరి 25న. రెండో టి20, రాజ్‌కోట్‌లో జనవరి 28న- మూడో టి20, జనవరి 31న పుణ వేదికగా- నాలుగో టి20, ఫిబ్రవరి 2-న ముంబై వేదికగా ఐదో టి20 ఆడనుంది.

ఈ పొట్టి సిరీస్ ముగిసిన వెంటనే నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 6న- తొలి వన్డే, కటక్‌లో ఫిబ్రవరి 9న- రెండో వన్డే, ఫిబ్రవరి 12-న అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలో తలపడనుంది. ఇక ఈ సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హైబ్రిడ్ వేదిక(దుబాయ్)పై ఆడనుంది. ఫిబ్రవరి 20న- బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23-న పాకిస్తాన్, మార్చి 2-న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇక గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్‌లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపిఎల్ 2025 మెగా సంగ్రామానికి తెరలేవనుంది.

ఐపిఎల్ ముగిసిన తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జూన్ 20న మొదలవుతుంది. జూన్ 20 నుంచి తొలి టెస్ట్ (లీడ్స్), జులై 2 నుంచి రెండో టెస్ట్ (బర్మింగ్‌హమ్), జులై 10- నుంచి మూడో టెస్ట్ (లండన్, లార్డ్స్), జులై 23- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్) జులై 31 నుంచి ఐదో టెస్ట్ ( కెన్నింగ్‌స్టన్ ఓవల్) తలపడనుంది. అయితే ఐసిసి షెడ్యూల్ ప్రకారం భారత్ 2025లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్‌లు ఆడనుంది. అయితే ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఖరారుకాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News