న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించినట్లు ప్రకటించిన 10 దేశాలలో భారత్ కూడా చేరింది. మాస్కోలో బుధవారం అధికారిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాలిబన్ డిప్యూటీ ప్రధాని అబ్దుల్ సలామ్ హనాఫీతో భారత అధికారులు భేటీ అయ్యారు. కాబూల్ పాలనకు మానవతా సహాన్ని కూడా ప్రకటించారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ విదేశాంగ వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న జెపి సింగ్‌తో తాలిబన్ ప్రతినిధి బృందం భేటీ అయిందన్నది వార్త. ఈ విషయాన్ని తాలిబన్‌ల ప్రతినిధి జబీవుల్లాహ్ ముజాహిద్ టిట్టర్ ద్వారా తెలిపారు. అయితే దీనిపూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాలిబన్లు కాబూల్‌ను ఆగస్టు 15న కైవసం చేసుకున్నాక తొలిసారి వారికి భారత సాయాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించినట్లు సంయుక్త ప్రకటనలో సంతకాలు చేసిన దేశాల్లో చైనా, ఇరాన్, రష్యా, పాకిస్థాన్, కజఖ్‌స్థాన్, కిర్గిజిస్థాన్, తుర్ఖ్‌మెనిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌తో పాటు భారత్ కూడా ఉంది.
తాలిబన్ డిప్యూటీ పిఎంతో భారత బృందం భేటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -