Monday, January 20, 2025

మహిళల ఆసియా కప్ హాకీకి భారత జట్టు ఎంపిక

- Advertisement -
- Advertisement -

Indian team selected for Women's Asia Cup Hockey

 

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఈ టోర్నీకి కెప్టెన్ రాణి రాంపాల్ దూరంగా ఉంది. దీంతో జట్టు సారథ్య బాధ్యతలను గోల్ కీపర్ సవితకు అప్పగించారు. డిఫెండర్ దీప్ గ్రేస్ ఎక్కా వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఒమన్ వేదికగా ఈ నెల 21 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో ఆసియాకు చెందిన పలు దేశాల జట్లు పోటీ పడుతున్నాయి. భారత్ పూల్‌ఎలో చోటు సంపాదించింది. జపాన్, మలేసియా, సింగపూర్ ఈ గ్రూపులో ఉన్నాడు. మరో గ్రూప్‌లో పాకిస్థాన్, కొరియా తదితర జట్లు ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో టాప్4లో ఉండే జట్లు ప్రపంచకప్ హాకీ టోర్నీకి అర్హత సాధిస్తాయి.

జట్టు వివరాలు:

గోల్ కీపర్లు: సవిత, రజని

డిఫెండర్స్: దీప్ గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, నిక్కి ప్రదాన్, ఉడిత

మిడ్‌ఫిల్డర్స్: నిషా, సుశీల, మోనిక, నేహా, సలిమా,జ్యోతి, నవ్‌జోత్ కౌర్

ఫార్వర్డ్: నవ్‌నీత్ కౌర్,లాల్‌రెమ్‌సియామి, వందన, మరినా కుజుర్, షర్మిలా దేవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News